Mana Enadu : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) అంతిమయాత్ర ప్రారంభమైంది. దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి నిగమ్‌బోధ్ ఘాట్ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మన్మోహన్ అంతిమయాత్రలో కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అంతకుముందు మన్మోహన్ పార్థివదేహాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చారు. ఏఐసీసీ (AICC) నేతలు, కార్యకర్తలు నివాళులర్పించే నిమిత్తం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉంచారు. పార్థివదేహం వద్ద సింగ్ సతీమణి గురుశరణ్ సింగ్, ఆయన కుమార్తె, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తదితర నేతలు అంజలి ఘటించారు.
#WATCH | Delhi | Mortal remains of former Prime Minister #DrManmohanSingh being taken to Nigam Bodh Ghat for his last rites.
Former PM Dr Manmohan Singh died on 26th December at AIIMS Delhi. pic.twitter.com/eySZA0A5PX
— ANI (@ANI) December 28, 2024






