
కంటెంట్ ఉన్నోడికి కటౌట్ తో పనిలేదని అంటుంటారు. ఇది నిజమే అని చాలా మందికి తెలుసు. అందంతో పని లేకుండా టాలెంట్ తో సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న నటుడు మనోజ్ బాజ్ పాయ్ (Manoj Bajpayee). ఓటీటీలో ఫ్యామిలీ మ్యాన్ (Family Man series) సిరీస్ తర్వాత మనోజ్ బాజ్ పాయ్ ను గుర్తుపట్టని వారు ఉండరు. ఈ వెబ్ సిరీస్ వల్ల చాలా ఫేమస్ అయ్యాడు. ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ సిరీస్ కు ఎంతో పేరు వచ్చింది. ఇందులో నటించిన ప్రియమణి (Priyamani) కూడా వెనుదిరిగి చూసుకోవడం లేదు. అంతలా అవకాశాలు వచ్చిపడుతున్నాయి.
మనోజ్ బాజ్ పాయ్ సత్య సినిమాలో ప్రత్యేకమైన క్యారెక్టర్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. రామ్ గోపాల్ వర్మను ( Ram Gopal Varma) డైరెక్టుగా పొగిడే వ్యక్తుల్లో మనోజ్ బాజ్ పాయ్ ఒకరు. అయితే బిగ్ స్క్రీన్స్ పై గుర్తింపు లేక ఓటీటీలో ఫేమస్ అయిన వ్యక్తుల్లో మనోజ్ బాజ్ పాయ్ ఒకరు. మనోజ్ బాజ్ పాయ్ తెలుగులో కూడా ఎన్నో సినిమాలు చేశారు. పవన్ కళ్యాణ్ (pavan kalyan) కొమరం పులి, అల్లు అర్జున్ తో హ్యాపీ, వేదం సినిమాలో కూడా కీలక రోల్ లో నటించాడు. కానీ తన పెర్ఫామెన్స్ కి తగ్గ ఐకానిక్ రోల్స్ మాత్రం అంతగా బిగ్ స్క్రీన్స్ పై పడలేదు. ఎప్పుడైతే ఓటీటీలో (ott) ఎంట్రీ ఇచ్చారో అక్కడ నుంచి తన దశ మారింది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్నాడు.
ఇన్ని సిరీస్ లు, సినిమాలు చేసినప్పటికీ ఎప్పుడు బోల్డ్ సీన్స్ లో, అడల్ట్ కంటెంట్ సీన్స్ లో కానీ చేసింది లేదు. ఇలాంటి నటుడు తాజాగా వచ్చిన ‘డిస్పాచ్’మూవీ ద్వారా రెచ్చిపోయాడు. మొత్తం బోల్డ్ సీన్స్ లో నటించి ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. అసలు ఇన్ని బూతు సీన్స్ లో మనోజ్ నిజంగానే నటించాడా? అసలు తన నుంచి ఈ రేంజ్ యాంగిల్ ని ఊహించలేదు అంటూ షాకవుతున్నారు. ఇంకొందరైతే బాలీవుడ్ ఫేమస్ రొమాంటిక్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీని (Emraan Hashmi) సైతం మనోజ్ ఇపుడు మించిపోయాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనితో సోషల్ మీడియా సహా ఓటిటిని (ott) ఇపుడు ఈ సినిమా షేక్ చేస్తుంది. ఈ సినిమా జీ 5 లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సినిమా పక్కన పెడితే మనోజ్ బాజ్‌పాయ్ హిందీలోనే మరిన్ని సినిమాలు సిరీస్ లు చేస్తుండగా “ది ఫ్యామిలీ మ్యాన్” కి మూడో సీజన్లో కూడా తాను కొనసాగనున్నారు.