మావోయిస్టులు (Maoists) ఘాతుకానికి ఒడిగట్టారు. ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattigsarh) సుకుమా జిల్లాలో భద్రతాబలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మందుపాతర (EID) పెట్టి పేల్చివేశారు. కుత్రు అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో 9 మంది జవాన్లు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. మంతుపాతర పేలిన సమయంలో వ్యాన్‌లో 15 మంది జవాన్లు ఉన్నట్లు సమాచారం. జవాన్లు ఉదయం పెట్రోలింగ్ చేస్తుండగా.. వారిని లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు ఐఈడీ పేల్చివేశారు.
నలుగురు మావోయిస్టుల మృతితో..
గతకొన్నాళ్లుగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుకుమా జిల్లాల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య తరచూ కాల్పులు జరుగుతున్నాయి. శనివారం అర్ధరాత్రి ఛత్తీస్‌గఢ్ లోని బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోగా.. ఓ కానిస్టేబుల్ మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సోమవారం భద్రతా దళాలు మావోయిస్టుల కోసం గాలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.







