
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)కి ముందు ఆస్ట్రేలియా క్రికెట్(Cricket Australia) జట్టుకు బిగ్ షాక్ తగిలింది. మినీ వరల్డ్ కప్‌గా భావించే ఈ టోర్నీకి మరో 13 రోజులు మాత్రమే ఉంది. ముఖ్యంగా ICC ఈవెంట్లలో చెలరేగి ఆడే ఆస్ట్రేలియా ఈసారి భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆ జట్టు స్టార్ ప్లేయర్లు మిచెల్ మార్ష్, జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్ ప్లేయర్లు గాయలతో సతమతవుతున్నారు. వీరలో మార్ష్, హేజిల్‌వుడ్ టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. కెప్టెన్ కమిన్స్ కూడా అందుబాటులో ఉంటాడో లేదో తెలియని పరిస్థితి.. ఈ నేపథ్యంలో ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్(All rounder Marcus Stoinis) షాకిచ్చాడు. అంతర్జాతీయ వన్డే ఫార్మాట్(International ODI format) నుంచి తప్పకుంటున్నట్లు ప్రకటించాడు.
Australia all-rounder Marcus Stoinis calls time on his ODI career, won’t be part of the Champions Trophy 2025. . #Australia #MarcusStoinis #ChampionsTrophy2025 #INDvsENG #ElonMusk #RohitSharma #Ajithkumar𓃵 #HAPPYJISUNGDAY #RajatDalal #AbhishekSharma pic.twitter.com/xLSiirrrfv
— Maharishi Book – Asia’s #1 gaming platform (@MaharishiBook) February 6, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటుదక్కినా..
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్(Marcus Stoinis) వన్డే ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పాడు. ఇకపై వన్డే ఫార్మాట్ ఆడనని, కేవలం T20 ఫార్మాట్‌పైనే దృష్టి పెట్టబోతున్నట్టుగా ప్రకటించాడు. ICC ఛాంపియన్స్ ట్రోఫీకి ఆసీస్ ఎంపిక చేసిన జట్టులో మార్కస్ స్టోయినిస్‌కి కూడా చోటు కల్పించింది ఆ దేశ బోర్డు. అయినా అతడు నిర్ణయం తీసుకోవడంతో టీమ్ మేనేజ్మెంట్ ఒకింత ఆశ్చర్యానికి గురైంది. టోర్నీకి రెండు వారాల ముందు అతను ODI ఫార్మాట్‌కి రిటైర్మెంట్(Retirement) ఇవ్వడంతో ఇద్దరు ఆల్రౌండర్లను వెతికే పనిలో పడింది క్రికెట్ ఆస్ట్రేలియా.
71 వన్డేల్లో 1495 పరుగులు
కాగా 35 ఏళ్ల మార్కస్ స్టోయినిస్ ఇప్పటిదాకా 71 వన్డేల్లో 1495 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 48 వికెట్లు(Wickets) తీశాడు. కీలకమైన భాగస్వామ్యాలను బ్రేక్ చేయడంలో, అలాగే అంతే కీలకమైన భాగస్వామ్యాలు నెలకొల్పడంలో సిద్ధహస్తుడైన మార్కస్ స్టోయినిస్, అవసరమైతే భారీ షాట్స్ ఆడుతూ మ్యాచ్ ఫినిషర్ రోల్(Match finisher role) కూడా పోషించగలడు. కాగా కెప్టెన్ కమిన్స్ గాయంతో ఈ టోర్నీకి దూరమైతే అతని స్థానంలో ట్రావిస్ హెడ్ లేదా స్టీవ్ స్మిత్(Steve Smith) ఆస్ట్రేలియాకి కెప్టెన్సీ చేసే అవకాశం ఉంది.