మార్గశిర మాసంలో విశేషమైన పండుగలు, తిథులు ఇవే

Mana Enadu : భగవద్గీతలో శ్రీకృష్ణుడు (Lord Sri Krishna) చెప్పినట్లుగా మాసాల్లోకెల్లా మార్గశిర మాసం అత్యుత్తమమైనది. ఆధ్యాత్మికత వెల్లివిరిసే మార్గశిర మాసంలో అనేక విశేషమైన పర్వదినాలు, పుణ్యతిథులున్నాయి. తెలుగు పంచాంగం ప్రకారం డిసెంబర్ 2వ తేదీ సోమవారం మార్గశిర శుద్ధ పాడ్యమితో మార్గశిర మాసం(Margasira Masam) మొదలై 30వ తేదీ సోమవారం మార్గశిర అమావాస్యతో ముగుస్తుంది. మరి ఈ  మాసంలో వచ్చే పర్వదినాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం.

మార్గశిర మాసంలో ముఖ్యమైన పర్వదినాలు ఇవే

  • డిసెంబర్ 2వ తేదీ సోమవారం మార్గశిర శుద్ధ పాడ్యమి : పోలి పాడ్యమి (Poli Padyami)
  • డిసెంబర్ 3 వ తేదీ మంగళవారం మార్గశిర శుద్ధ విదియ : చంద్ర దర్శనం
  • డిసెంబర్ 4 వ తేదీ బుధవారం మార్గశిర శుద్ధ తదియ : తిరుమంగైయాళ్వార్ ఉత్సవం ప్రారంభం
  • డిసెంబర్ 5 వ తేదీ గురువారం మార్గశిర శుద్ధ చవితి : మార్గశిర లక్ష్మీవార వ్రతం మొదటి వారం.
  • డిసెంబర్ 6 వ తేదీ శుక్రవారం మార్గశిర శుద్ధ పంచమి : పంచమి తీర్ధం
  • డిసెంబర్ 8 వ తేదీ ఆదివారం మార్గశిర శుద్ధ సప్తమి : భానుసప్తమి.
  • డిసెంబర్ 11 వ తేదీ బుధవారం మార్గశిర శుద్ధ ఏకాదశి: మోక్షద ఏకాదశి, సర్వ ఏకాదశి, గీతాజయంతి.
  • డిసెంబర్ 12 వ తేదీ గురువారం మార్గశిర శుద్ధ ద్వాదశి: మార్గశిర లక్ష్మీవార వ్రతం రెండో వారం. మత్స్య ద్వాదశి. తిరుమలలో చక్రతీర్ధ ముక్కోటి.
  • డిసెంబర్ 13 వ తేదీ శుక్రవారం మార్గశిర శుద్ధ త్రయోదశి: పక్ష ప్రదోషం. హనుమద్వ్రతం. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి సన్నిధిలో కృత్తికా దీపోత్సవం.
  • డిసెంబర్ 14 వ తేదీ శనివారం మార్గశిర శుద్ధ చతుర్దశి పౌర్ణమి: శ్రీ దత్తాత్రేయ జయంతి.
  • డిసెంబర్ 15 వ తేదీ ఆదివారం మార్గశిర శుద్ధ పౌర్ణమి/ పాడ్యమి: ధనుస్సంక్రమణం. తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తిక దీపోత్సవం. కపిల తీర్ధ ముక్కోటి.
  • డిసెంబర్ 16 వ తేదీ సోమవారం మార్గశిర బహుళ పాడ్యమి: ధనుర్మాసం ప్రారంభం. 
  • డిసెంబర్ 18 వ తేదీ బుధవారం మార్గశిర బహుళ చవితి: సంకష్టహర చతుర్థి
  • డిసెంబర్ 22 వ తేదీ ఆదివారం మార్గశిర బహుళ సప్తమి: భానుసప్తమి
  • డిసెంబర్ 25 వ తేదీ బుధవారం: క్రిస్మస్ పండుగ
  • డిసెంబర్ 26 వ తేదీ గురువారం మార్గశిర బహుళ ఏకాదశి: సర్వ ఏకాదశి
  • డిసెంబర్ 28 వ తేదీ శనివారం మార్గశిర బహుళ త్రయోదశి: శని త్రయోదశి, శని ప్రదోషం.
  • డిసెంబర్ 29 వ తేదీ ఆదివారం మార్గశిర బహుళ చతుర్దశి: మాస శివరాత్రి.
  • డిసెంబర్ 30 వ తేదీ సోమవారం మార్గశిర బహుళ అమావాస్య: సోమావతి అమావాస్య, ధర్మ అమావాస్య . ఈరోజుతో మార్గశిర మాసం ముగుస్తుంది. 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *