ఐసీసీ తొలి టైటిల్ దక్కించుకునే దిశగా సౌతాఫ్రికా(South Africa) అడుగులు వేస్తోంది. లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్(WTC Final 2025)లో సఫారీలు విజయం దిశగా పయనిస్తున్నారు. మూడో రోజు, శుక్రవారం ఆట ముగిసే సమయానికి సఫారీ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. కెప్టెన్ టెంబా బవుమా, ఎయిడెన్ మార్‌క్రమ్(Aiden Markram) అద్భుతమైన భాగస్వామ్యంతో జట్టును విజయానికి చేరువ చేస్తున్నారు.
మార్‌క్రమ్ అద్భుత సెంచరీ
ఆస్ట్రేలియా నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో ఆదిలోనే తడబడింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (6) కేవలం 9 పరుగుల వద్ద మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వియాన్ ముల్డర్ (27) దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినా, 70 పరుగుల వద్ద స్టార్క్ బౌలింగ్‌లోనే లబుషేన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ దశలో మార్‌క్రమ్(Aiden Markram), కెప్టెన్ టెంబా బవుమా(Temba Bavuma) సంయమనంతో ఆడుతూ, ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. మార్‌క్రమ్ 159 బంతుల్లో 102* పరుగులు చేయగా, బవుమా 121బంతుల్లో 65 పరుగులు చేసి అజేయంగా క్రీజులో ఉన్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 47 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. విజయం సాధించాలంటే సఫారీ జట్టు మరో 69 పరుగులు చేయాల్సి ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టాడు.
A century of the highest class from Aiden Markram! 💯🔥
Composed under pressure, fearless in execution, what a time for a knock for the ages. 🇿🇦💪
A phenomenal player rising to the occasion when it matters most. Take a bow, Markram, pure brilliance! 🔥👏 #WTCFinal #WozaNawe… pic.twitter.com/8a56K43jpf
— Proteas Men (@ProteasMenCSA) June 13, 2025
65 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్
అంతకుముందు, తమ రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా(Australia) 65 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ అయింది. మిచెల్ స్టార్క్ (58 నాటౌట్) ఒంటరి పోరాటం చేయగా, అలెక్స్ క్యారీ (43) అతనికి కొంత సహకారం అందించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబడా 4 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించగా, లుంగి ఎంగిడి 3 వికెట్లు, మార్కో జాన్సెన్, వియాన్ ముల్డర్, ఏడెన్ మార్‌క్రమ్ తలో వికెట్ తీశారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 138 రన్స్ చేయగా.. ఆస్ట్రేలియా 212 పరుగులు చేసింది.






