మార్వెల్ నుంచి కొత్త సూపర్ హీరోస్..’థండ‌ర్‌బోల్ట్స్’ ట్రైల‌ర్ చూశారా?

హాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మార్వెల్ (Marvel) నుంచి మరో కొత్త సినిమా వచ్చేస్తోంది. ఈసారి సరికొత్త సూప‌ర్ హీరోస్ ను ఈ నిర్మాణ సంస్థ ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజా సినిమా ‘థండ‌ర్‌బోల్ట్స్ (Thunderbolts)’ ట్రైలర్ ను రిలీజ్ చేసింది.  జేక్ ష్రెయిర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఫ్లోరెన్స్ పగ్, సెబాస్టియన్ స్టాన్, డేవిడ్ హార్బర్, వ్యాట్ రస్సెల్, ఓల్గా కురిలెంకో, పుల్‌మాన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మార్వెల్ నుంచి సరికొత్త సూపర్ హీరోస్

మే 2వ తేదీన ‘థండర్ బోల్ట్స్’ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా తెలుగు ట్రైలర్ (Thunderbolts Telugu Trailer) రిలీజ్ చేశారు. అవెంజ‌ర్స్ అమెరికాను విడిచి వెళ్లిన తర్వాత ఆ న‌గ‌రానికి కొత్త సూప‌ర్ హీరోల అవ‌సరం వ‌స్తుంది. ఈ క్రమంలోనే ఈ నగరాన్ని కాపాడే బాధ్యతను అమెరిక‌న్ ర‌క్ష‌ణ విభాగం సెబాస్టియన్ స్టాన్ (వింటర్ సోల్జర్)కి అప్ప‌గిస్తుంది. అప్పుడు వింట‌ర్ సోల్జ‌ర్.. థండ‌ర్ బోల్ట్స్ అనే ఒక టీమ్‌ను త‌యారు చేస్తాడు.

థండర్ బోల్ట్స్ టీమ్

మరి వింటర్ తయారు చేసిన ఈ థండ‌ర్‌బోల్ట్స్ అమెరికాను ఎవ‌రి నుంచి ర‌క్షిస్తుంది.. ఎలా రక్షిస్తుంది.. అమెరికాను రక్షించేందుకు ఈ టీమ్ చేసే సాహ‌స‌లేంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఫుల్ ఆన్ యాక్ష‌న్ ప్యాక్‌డ్‌గా సాగిన ఈ ట్రైల‌ర్ ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. తెలుగులోనూ భారీ వ్యూస్ సాధిస్తూ థండర్ బోల్ట్స్ దూసుకెళ్తోంది. మరి మీరూ ఈ ట్రైలర్ ను చూసేయండి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *