
మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) తన అభిమానులకు పండగ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం ‘మాస్ జాతర(Mass Jathara)’ టీజర్(Teaser)ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. వినాయక చవితి సందర్భంగా ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. భాను భోగవరపు(Bhanu Bhogavarapu) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ(Nagavamshi), సాయి సౌజన్య సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నారు. పండగ సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని, విడుదల తేదీని ఖరారు చేయడంతో పాటు ప్రచార కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.
Ravi Teja’s #MassJathara Teaser Guarantees a Blockbuster This August 27th🔥🔥💥
👉Mass Jathara teaser is out now and it’s everything fans hoped for and more. A full meals mass entertainer loaded with action and vintage energy of Mass Maharaja #RaviTeja.
👉Teaser sets the tone… pic.twitter.com/qMyml9Nu0e
— PaniPuri (@THEPANIPURI) August 11, 2025
సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు
ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రీలీల(Sreeleela) కథానాయికగా నటిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ధమాకా(Dhamaka)’ విజయం సాధించడంతో, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈసారి ‘మాస్ జాతర’లో రవితేజ ఒక పవర్‌ఫుల్ రైల్వే పోలీస్ ఆఫీసర్(Police Officer) పాత్రలో కనిపించనుండటం విశేషం. టీజర్‌లో ఆయన లుక్, యాక్షన్ సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో(Bheem’s Cicerolio) సంగీతం అందిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. టీజర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.