అగ్రరాజ్యంపై ప్రకృతి ప్రకోపం.. తుఫాను బీభత్సంతో 34మంది మృతి

అగ్రరాజ్యాన్ని ప్రకృతి వణికిస్తోంది. మొన్నటి వరకూ కార్చిచ్చుతో వేలాది ఎకరాల్లో అడవులు, జనాలు, వన్యసంపదకు నష్టం చేకూరగా.. తాజాగా తుఫాను(storm) బీభత్సం సృష్టించింది. దీంతో అమెరికన్లు అల్లాడిపోతున్నారు. తాజగా అగ్రరాజ్యం అమెరికా(USA)ను టోర్నడోలు(Tornodo) వణికిస్తున్నాయి. వివిధ రాష్ట్రాలలో పెనుగాలులు విధ్వంసం సృష్టించాయి. వంద కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. రోడ్లపై వెళుతున్న వాహనాలు బోల్తాపడ్డాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 34 మంది మృత్యువాత పడ్డారని అధికారులు తెలిపారు. కెనడా నుంచి టెక్సాస్‌ వైపు గంటకు 130KM వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

LIVE: Tracking Severe weather tornado outbreak across southern US

ఆ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ

టోర్నడోల ధాటికి మిస్సోరీలో 12 మంది, ఆర్కన్సాస్‌లో ముగ్గురు, కాన్సాస్‌(Kansas)లో 8 మంది, మిస్సిస్సిప్పీ(Mississippi)లో ఆరుగురు, టెక్సాస్‌లో నలుగురు మరణించారు. ఆర్కన్సాస్‌లో 29 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు కార్చిచ్చులు చెలరేగడంతో ఓక్లహోమా, మిస్సోరీ, న్యూమెక్సికో, టెక్సాస్‌, కాన్సస్‌లలో ఆయా ప్రాంతాల నుంచి జనాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మిన్నెసొటా, సౌత్‌ డకోటాలోని పలు ప్రాంతాలకు మంచు తుఫాన్(storm) ముప్పు ఉందని అధికారులు హెచ్చరించారు. దీంతో వేలాది మంది బిక్కుబిక్కుమంటున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *