Varun Tej’s Matka: ‘మట్కా’ డిజాస్టర్.. మెగాప్రిన్స్‌కు ఏమైంది?

టాలీవుడ్‌ ఇండస్ట్రీ(Tollywood industry)లో మెగా ఫ్యామిలీ(Mega Family)కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ కుటుంబం నుంచి ఏ హీరో సినిమా వచ్చిన సరే అభిమాను(Fans)ల్లో ఓ రేంజ్‌లో హోప్స్ ఉంటాయి. అటు ఫ్యాన్స్ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా ఈ ఫ్యామిలీ హీరోలు జాగ్రత్త పడుతుంటారు. మెగాస్టార్(Megastar) నుంచి ఇటీవల ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) వరకూ ఫుల్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలూ లేకపోలేదు. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, రీచ్ సంపాదించి.. తర్వాతి తరం హీరోలకు దాన్ని వారసత్వంగా అందించారు.

చిరు ఫాలోయింగ్‌ను అందుకోలేకపోతున్నారా?

మెగా ఫ్యామిమీలో రెండో తరం వారసుల్లో రామ్ చరణ్(Ram Charan) మెగా సపోర్ట్‌తో గొప్ప స్థాయికి ఎదిగి తండ్రికి తగ్గ తనయుడిగా నిలిస్తే.. బన్నీ(Allu Arjun) మెగా బలానికి తోడు సొంతంగా కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుని తిరుగులేని స్థాయికి చేరుకున్నాడు. సాయిధరమ్ తేజ్(Sai daram tej), వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌లకు సైతం కెరీర్ ఆరంభంలో మంచి సపోర్టే లభించింది. ఐతే ఈ ముగ్గురూ పడి లేస్తూ ముందుకు సాగుతున్నారు. వీరిలో వరుణ్‌(Varun)ది మొదట్నుంచి భిన్నమైన ప్రయాణం. అతను చాలామంది వారసుల్లా మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించలేదు. పెద్ద మాస్ హీరో కావడానికి తగ్గ కటౌట్ ఉన్నా.. క్లాస్ టచ్ ఉన్న భిన్నమైన సినిమాలే చేస్తూ ముందుకు సాగాడు.

వరుస ప్లాప్‌లు.. వరుణ్ తేజ్‌కు ఏమైంది?

ఫిదా(Fida), తొలి ప్రేమ, F-2, గద్దలకొండ గణేష్ లాంటి సినిమాలతో వరుణ్ కెరీర్ మంచి స్థితిలోనే కనిపించింది. కానీ తర్వాత వరుస ఫ్లాపులు అతణ్ని వెనక్కి లాగేశాయి. గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ చిత్రాలు డిజాస్టర్లు కావడం వరుణ్ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ మీద తీవ్ర ప్రభావమే చూపాయి.
అయితే ‘మట్కా(Matka)’తో అతను పుంజుకుంటాడని అంతా అనుకున్నారు. తీరా చూస్తే ‘మట్కా’ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. కాగా నవంబర్ 14న రిలీజైన సినిమాకు పూర్తిగా నెగటివ్ టాక్ వచ్చింది. ప్రీ రిలీజ్ బజ్(Pre Release Buss) లేకపోవడం వల్ల ‘మట్కా(Matka)’కు బుకింగ్స్ కూడా అంతంత మాత్రంగా అయ్యాయి. కాగా ఈ మూవీని దర్శకుడు కరుణ కుమార్‌ తెరకెక్కించగా.. వరుణ్ సరసన మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ నటించారు. నవీన్ చంద్ర, జాన్ విజయ్, సత్యం రాజేష్, రవి శంకర్, సలోని తదితరులు కీలక పాత్ర పోషించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *