బాలనటిగా సినీ రంగంలో అడుగుపెట్టిన మీనా(Meena) తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. బాల్యం నుంచే తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి, హీరోయిన్గా అగ్రస్థాయికి ఎదిగింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ సినిమాలలోనూ నటించి అనేకమంది ప్రేక్షకుల గుండెల్లో నిలిచింది. మీనా నటిగా కొనసాగిస్తూనే, 2009లో బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్‌ను వివాహం చేసుకుంది. వారికి ఒక కుమార్తె కూడా ఉంది.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన మీనా.. ఇప్పుడు ప్రాధాన్యత గల పాత్రలు చేస్తూ అలరిస్తుంది. అయితే ఆమె భర్త కరోనా సమయంలో అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుండి మీనా తన కుమార్తె నైనిక మీదే దృష్టి పెట్టింది. కూతురి అన్ని బాధ్యతలు స్వయంగా తానే చూసుకుంటోంది. నైనిక దళపతి విజయ్(Vijay Dalapati) నటించిన తేరీ సినిమాలో ఆయన కూతురిగా ఈ చిన్నారి నటించి మెప్పించింది.
ఇదిలా ఉండగా, గత కొద్ది రోజులుగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వార్తల్లో ముఖ్యంగా కోలీవుడ్ నటుడు ధనుష్(Dhanush) పేరు వినిపించడం గాసిప్స్‌కు మరింత ఊపు తీసుకొచ్చింది. ఇప్పటికే ధనుష్ తన భార్య ఐశ్వర్యతో విడాకులు తీసుకున్న నేపథ్యంలో, మీనాతో అతనికి సంబంధం ఉందని పుకార్లు గట్టిగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ రూమర్లపై మీనా గతంలోనే స్పందిస్తూ, అవి పూర్తిగా అసత్యమని తేల్చిచెప్పింది.
తాజాగా హీరోయిన్ మీనా రెండో పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ప్రచారాలపై పరోక్షంగా స్పందించారు. “ప్రతి ఒక్కరి వారి వ్యక్తిగత జీవితం గురించి ఆలోచిస్తారు. మీనా భర్త చనిపోవడంతో ఆమె ఎంతో బాధలో ఉంది. ఆమె భర్త చనిపోవడం చాలా బాధాకరం. గత కొన్నిరోజులుగా ఆమె రెండో పెళ్లి చేసుకోబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏమో చేసుకోవచ్చేమో అందులో తప్పేముంది.. .అంటూ మీనా రెండో పెళ్లి గురించి చెప్పుకొచ్చారు. గీతాకృష్ణ అలా మాట్లాడడంతో మరోసారి మీనా రెండో పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ధనుష్ తోనే మీనా రెండో పెళ్లి అంటూ మరోసారి రూమర్లు చెక్కర్లు కొడుతున్నాయి.






