ప్రస్తుతం కేరళలోని అలప్పుఝా ప్రాంతంలో మూడో షెడ్యూల్ కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో షూటింగ్ స్పాట్ నుంచి ఓ వీడియో లీకైంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
అందమైన బ్యాక్‌డ్రాప్ మధ్య.. బోటులో చిరంజీవి, నయనతారపై ఓ పాటను చిత్రీకరిస్తున్న దృశ్యాలు అందులో కనిపించాయి. చిరంజీవి పంచె కట్టులో సంప్రదాయంగా కనిపించగా, నయనతార చీరలో చాలా అందంగా కనిపిస్తున్నారు. బోటు పూలతో అలంకరించబడి ఉండటంతో ఇది పెళ్లి సన్నివేశం కావచ్చని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఫన్నీగా స్పందిస్తూ బోటులో ‘ఫస్ట్ నైట్ సీన్’ షూట్ చేస్తున్నారేమో అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు.
#Nayanthara & #Chiranjeevi from #Mega157. Shooting currently happening in Kerala #ChiruAnil pic.twitter.com/mmGgfUmYpE
— Nayan wings (@Nayan_Universal) July 18, 2025






