సంక్రాంతి హీరోలతో ‘మెగా’ ఇంటర్వ్యూ.. ఇక కిక్కే కిక్కు

ఈ ఏడాది సంక్రాంతి పండుగ(Sankranti)కు మూడు బడా సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్న విషయం తెలిసిందే. జనవరి 10వ తేదీన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్ (Game Changer)’ రిలీజ్ కానుంది. ఇక 12వ తేదీన నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్ (Daaku Maharaaj)’, 14వ తేదీన వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఈ సినిమాల నుంచి ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక మూడు చిత్రాల మేకర్స్ ప్రమోషన్స్ లో బిజీబిజీగా గడుపుతున్నారు.

సంక్రాంతికి పండుగే పండుగ

ఈ సంక్రాంతి రేసులోకి దిగిన ఈ మూడు సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు రెడీ అయ్యాయి. ఈ ఏడాది ఫస్ట్ హిట్ తామే కొడ్తామంటే తామే కొడతామని మూడు చిత్రాలు దేనికదే ధీమాగా ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాలకు సంబంధించిన పలు ఈవెెంట్లు కూడా జరిగాయి. మరోవైపు సోషల్ మీడియాలోనూ భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తున్నాయి. అయితే తాజాగా ఈ మూడు చిత్రాలకు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. అదేంటంటే..?

సంక్రాంతి హీరోలతో మెగా సర్ ప్రైజ్

సంక్రాంతి పండుగ సందర్భంగా.. ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకునేందుకు ఈ మూడు చిత్రాల మేకర్స్ ఓ బిగ్ సర్ ప్రైజ్ ప్లాన్ చేశారట. సంక్రాంతి హీరోలు రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేశ్ (Venkatesh)లను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇంటర్వ్యూ చేయబోతున్నారట. ఈ ఇంటర్వ్యూలో వారు నటించిన గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల ముచ్చట్లు పెట్టబోతున్నారట. సంక్రాంతి హీరోలతో మెగా ఇంటర్వ్యూ అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

పండుగ వేళ కిక్కే కిక్కు

ఇదే నిజమైతే ఈ పండుగకు ఇది ప్రేక్షకులకు బిగ్ ట్రీట్ గా నిలబోతోంది. బాలయ్య (Balakrishna), వెంకీ, చెర్రీలతో చిరు సరదా సంభాషణ అంటే సూపర్ బజ్ క్రియేట్ అవుతుంది. ఈ నలుగురు ఒకచోట కలిసి.. సినిమా కబుర్లు చెబితే కిక్కే కిక్కు అని నెటిజన్లు అంటున్నారు. ముఖ్యంగా బాలయ్య, చిరు, వెంకీల కాంబోను ఒకే చోట చూడటానికి రెండు కళ్లు చాలవని అంటున్నారు. మరి దీనిపై ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *