Mana Enadu : సెకండ్ ఇన్నింగ్స్ లో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే ‘విశ్వంభర’ సినిమాతో బిజీగా ఉన్న ఆయన తాజాగా తన ఫ్యాన్స్‌కు ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. ఓ యంగ్ డైరెక్టర్ కథకు ఆయన రీసెంట్గా ఓకే చెప్పినట్లు ఇటీవల సోషల్ మీడియాలో న్యూస్ బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ ఓ అధికారిక అనౌన్స్మెంట్ వచ్చేసింది. అయితే ఇందులో ఓ ఊహించని ట్విస్టు ఉందండోయ్.. అదేంటంటే..?
నాని-చిరు సినిమా
‘దసరా’ ఫేం శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)తో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది. ఈ ప్రకటనలో ఎవరూ ఊహించని ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ చిత్రానికి నేచురల్ స్టార్ నాని (Nani) సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నాని తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఎమోషనల్ పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు బాగా వైరల్ అవుతోంది. మరి ఆ పోస్టు ఏంటో.. మీరూ చూసేయండి.
I grew up inspired by him
I stood in the lines for hours everytime
I lost my cycle
I celebrated him
Now I PRESENT HIM
It’s a full circle @KChiruTweetsUNLEASHING THE MEGASTAR MADNESS WE HAVE BEEN WAITING FOR.
With my boy who dreamt this @odela_srikanth @Unanimousprod… pic.twitter.com/TdtY5XnTUX
— Nani (@NameisNani) December 3, 2024
ఆ కల నిజం అవుతోంది
“ఆయన్ను చూసి ప్రేరణ పొందుతూనే నేను ఎదిగాను. ఆయన సినిమాల కోసం గంటల తరబడి క్యూలైన్‌లలో ఎదురుచూశాను. చివరకు ఓసారి నా సైకిల్‌ను కూడా పోగొట్టుకున్నాను. ఆయన సినిమా వచ్చిందంటే మాకు ఓ పండుగ. ఆయనే మాకు ఓ వేడుక. ఇప్పుడు ఆయన్నే నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. భూమి గుండ్రంగా ఉంటుంది అంటే ఇదేనేమో. మెగాస్టార్ చిరంజీవిని మరింత కొత్తగా చూపించడానికి మేమెంతో వేచి చూస్తున్నాం. నా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela Chiranjeevi)తో ఆ కల నిజం కానుంది.” అని నాని ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఈ పోస్టులో చిరంజీవితో కలిసి శ్రీకాంత్, నాని దిగిన ఫొటోను జత చేశారు.
హింసలోనే శాంతి వెతుక్కున్నాడు
— Nani (@NameisNani) December 3, 2024
మరోవైపు.. చేతులకు రక్తం కారుతున్న ఓ పోస్టర్‌ను షేర్ చేసి “హింసలోనే అతడు తన శాంతిని వెతుక్కున్నాడు” అంటూ ఓ పవర్ఫుల్ క్యాప్షన్‌ను యాడ్ చేశారు. అనానిమస్ ప్రొడక్షన్స్, SLV సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. మరోవైపు శ్రీకాంత్ ఓదెల, నాని కాంబోలో ‘ది ప్యారడైజ్ (The Paradise)’ అనే సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం తర్వాత చిరు ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనుంది.






