మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం (Praja Rajyam Party) అనే పార్టీని స్థాపించి దాదాపు పదేళ్ల పాటు రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నారు. అలా పదేళ్లు సినిమాకు దూరమయ్యారు. అయితే రాజకీయ జీవితానికి ఇక స్వస్తిపలికి మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు వరుస చిత్రాలు చేస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాలు చేయడమే కాదు.. యంగ్ హీరోలను ప్రోత్సహిస్తూ వారి సినిమాలకు మద్దతు కూడా ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు ఈవెంట్లకు హాజరవుతున్నారు.
ఇండస్ట్రీలో నో కాంపౌండ్స్
తాజాగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ‘లైలా’ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (Laila Pre Release Event)కు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండస్ట్రీకి కాంపౌండ్ లు ఏం లేవని.. ఇక్కడ అంతా కలిసికట్టుగా ఉంటామని తెలిపారు. మెగా హీరోలమంతా కలిసికట్టుగానే ఉన్నామని.. పవన్ కల్యాణ్ (Pawan Kalyan)పేరు రాగానే ఆడియెన్స్ అంతా కేరింతలు కొట్టడం చూసి చాలా ఆనందంగా అనిపించిందని తెలిపారు. ఇక పుష్ప-2 క్రియేట్ చేసిన రికార్డులు చూస్తుంటే గర్వంగా ఉందని చెప్పారు.
ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం
ఇక ఈ ఈవెంట్ లో తన ప్రజారాజ్యం పార్టీ, తన సోదరుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన (Janasena) గురించి చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరాటే రాజు (విశ్వక్ తండ్రి)తో తనకు పరిచయం ఉందని తెలిపారు. ‘ప్రజారాజ్యం’ సమయంలో రాజకీయంగా కీలకంగా ఉండేవారని గుర్తు చేశారు. ‘ప్రజారాజ్యం.. జనసేనగా రూపాంతరం’ చెందింది అంటూ మెగాస్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక చిరంజీవి నోట ప్రజారాజ్యం పేరు ప్రస్తావించగానే అభిమానులు కేరింతలు కొట్టారు.
ప్రజారాజ్యమే మళ్ళీ జనసేన గా రూపాంతరం చెందింది – మెగాస్టార్ చిరంజీవి at #Laila Pre Release Event. 👏#PRP #PRP2 #Janasena pic.twitter.com/GpXLqVj7Sx
— H A N U (@HanuNews) February 9, 2025






