Kubera Success Meet: నాగ్ నాకు ఇన్‌స్పిరేషన్: చిరంజీవి

బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది ‘కుబేర’ మూవీ. దీంతో మూవీ టీమ్ హైదరాబాద్‌లో కుబేర సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. అలాగే కుబేర హీరో ధనుష్, అక్కినేని నాగార్జున, హీరోయిన్ రష్మిక మందన్న, డైరెక్టర్ శేఖర్ కమ్ముల, మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ సహా పలువురు సినీ, టెక్నికల్ ప్రముఖులు హాజరయ్యారు.

ఇక్కడున్న వాళ్లంతా నా వాళ్లే..

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. కుబేర పాత్రలో ధనుష్‌ అద్భుతంగా నటించారని కొనియాడారు. ఓ సన్నివేశంలో బెగ్గర్ పాత్రలో ధనుష్ తన నటనతో కన్నీరు పెట్టించాడని అన్నారు. ఇక అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేక చెప్పాల్సిన పనిలేదన్నారు. ఎప్పుడూ విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటారని కొనియాడారు. చాలా విషయాల్లో నాగ్ తనకు ఇన్‌స్పిరేషన్ అని చెప్పుకొచ్చారు చిరు. ఇక శేఖర్ కమ్ములను చూస్తే చాలా గర్వంగా ఉందన్నారు. ‘ఇది నా సక్సెస్ మీట్‌లా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడున్న వాళ్లంతా నా వాళ్లే. అందుకే ఇది నా సక్సెస్ మీట్ అంటున్నా. ఇక్కడికి గెస్టుగా రాలేదు.. మీ ఆత్మీయుడిలా వచ్చాను’ అని చిరంజీవి అన్నారు.

రష్మిక ఇకపై ‘నాగ్ క్రష్’

ఇక అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. తనకు ఇంత మంచి పాత్ర అందించిన డైరెక్టర్ శేఖర్ కమ్ములకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాలో ఎవరూ స్పెషల్ హీరోకాదని, సినిమాలో నటించిన అందరూ హీరోలేనని కొనియాడు. ఎందుకంటే పాత్రలు అలా క్రియేట్ చేశారని డైరెక్టర్‌ని ప్రశంసించారు. కుబేర’ (Kubera) విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని నాగార్జున (Nagarjuna) అన్నారు. ఆ మూవీ సక్సెస్‌ మీట్‌లో క్లారిటీ ఇచ్చారు. ఇక నటి రష్మికపై ప్రశంసలు కురిపించారు. రష్మిక నటన ‘క్షణం క్షణం’ మూవీలో శ్రీదేవిని గుర్తుకు తెచ్చిందని, రష్మిక ‘నేషనల్ క్రష్’ మాత్రమే కాదని, ఇకపై ‘నాగ్ క్రష్’ అని కొనియాడారు.

నన్ను మరో మెట్టు ఎక్కించిన చిత్రమిది..

రష్మిక మాట్లాడుతూ.. ఏదైనా చిత్రాన్ని అంగీకరించే ముందుకు చాలా సందేహాలు ఉంటాయి. కానీ, ‘కుబేర’ విషయంలో అలాంటిదేం లేదు. దర్శకుడు ఎలా చెబితే అలా సమీర పాత్ర పోషించా. ఇలాంటి రోల్‌ నాకు దక్కినందుకు నాకే ఆశ్చర్యంగా ఉంది. నటిగా నన్ను మరో మెట్టు ఎక్కించిన చిత్రమిది. శేఖర్‌, నాగార్జున, ధనుష్‌, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌.. ఈ సినిమాకి మూల స్తంభాల్లాంటి వారని అని రష్మిక ప్రశంసించారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *