‘కాంపౌండ్ క్వశ్చన్’కు విశ్వక్ ఆన్సర్ అదుర్స్ : చిరంజీవి

మీరు నందమూరి కాంపౌండ్ నుంచి మెగా కాంపౌడ్ (Mega Compound)కు వెళ్లారా?.. అంటూ ‘లైలా’ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen)కు విలేకర్ల నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. దానికి విశ్వక్ నాకు మా ఇంటికి ఉన్న కాంపౌండ్ గురించి మాత్రమే తెలుసంటూ దిమ్మదిరిగే సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే విలేకర్ల ప్రశ్నకు విశ్వక్‌సేన్‌ దీటైన సమాధానం ఇచ్చాడంటూ తాజాగా మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. ఇండస్ట్రీకి కాంపౌండ్‌లు లేవని ఆయన పునరుద్ఘాటించారు. ‘లైలా’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (Laila Pre Release Event)కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

విశ్వక్ చక్కగా సమాధానమిచ్చాడు

ఈ సందర్భంగా చిరంజీవి (Chiranjeevi) కాంపౌండ్ అంటూ విలేకర్లు అడిగిన అంశం గురించి మాట్లాడారు. ‘‘విశ్వక్‌సేన్‌ సినిమా ఈవెంట్ కు వెళ్తున్నాను అని తెలిసి కొందరు నాతో.. ‘అతడు మన మనిషి కాదు బాలకృష్ణ మనిషి. అప్పుడప్పుడు తారక్‌ అంటుంటాడు’ అంటూ చెప్పారు. అయితే వేరే వారిపై అభిమానం ఉండకూడదా? అని నేను అడిగాను. మా చెర్రీకి కోలీవుడ్ హీరో సూర్య అంటే చాలా ఇష్టం. అందుకని నేను వాడి సినిమా ఫంక్షన్స్‌కు వెళ్లొద్దా? కాంపౌండ్‌.. అంటూ ఇటీవల ప్రెస్‌మీట్‌లో ఎదురైన ప్రశ్నకు.. ‘మా ఇంటికి కాంపౌండ్‌ ఉందిగానీ ఫిల్మ్‌ ఇండస్ట్రీకి లేదు’ అని విశ్వక్‌ చక్కగా సమాధానం ఇచ్చాడు.

మేమంతా కలిసుంటాం

నేను, నాగ్, వెంకీ, బాలయ్య కలిసికట్టుగా ఉంటాం. తరచూ కలుసుకుంటాం. మా ఇంటి హీరోలంతా కలిసి మెలిసి ఉంటాం. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పేరు వినిపించగానే మీరంతా కేకలు పెట్టారు. అది చూస్తే నాక చాలా గర్వంగా అనిపిస్తుంది. అల్లు అర్జున్ ‘పుష్ప 2 (Pushpa 2)’ చిత్రం పెద్ద హిట్‌ అయింది. దానికి గర్విస్తున్నా. లైలా సినిమాలో  లేడీ గెటప్పు (Vishwak Sen Lady Get Up)లో విశ్వక్‌ బాగున్నాడు. అతగాడు అమ్మాయి అయి ఉంటే గుండె జారి గల్లంతు అయ్యేదేమో. గతంలో లేడీ గెటప్పులో వచ్చిన సినిమాలన్నీ బాగా ఆడాయి. ఈ సినిమా కూడా తప్పకుండా హిట్‌ అవుతుంది’’ అని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *