Matka Trailer: మట్కా ట్రైలర్ వచ్చేసింది.. కేకపుట్టిస్తున్న వరుణ్ డైలాగ్స్!

ManaEnadu: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా నటించిన తాజా సినిమా ‘మట్కా(Matka)’. ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్(Karuna Kumar) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ నేడు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) చేతుల మీదుగా విడుదలైంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) నటించారు. నోరా ఫతేహి(Nora Fatehi) కీలక పాత్ర చేశారు. నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సామాన్య యువకుడి నుంచి సామ్రాజ్యానికి అధినేతగా

విశాఖ నేపథ్యంలో ‘మట్కా(Matka)’ను తెరకెక్కిస్తున్నారు. ఓ సామాన్య యువకుడు ‘మట్కా’ సామ్రాజ్యానికి అధినేతగా ఎలా ఎదిగాడు? డబ్బు కోసం ఏం చేశాడు? అనేది క్లుప్తంగా కథ. ఇప్పటికే విడుదలైన టీజర్(Teaser), సాంగ్స్(Songs) ద్వారా కొంత కథ చెప్పారు. కానీ, ఇవాళ విడుదలైన ట్రైలర్ చూస్తే… కథ కంటే వరుణ్ తేజ్ పెర్ఫార్మన్స్ ఎక్కువ ఆకట్టుకుంటోంది. గెటప్స్ పరంగా వేరియేషన్ చూపించడం గానీ, నటనలో ఇంటెన్స్ గానీ సూపర్ అని చెప్పాలి. ఈ చిత్రాన్ని నవంబర్ 14 న థియేటర్లలోకి తీసుకువస్తున్నారు. ఈ సినిమాను వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్‌నూ మీరూ చేసేయండి..

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *