
తెలంగాణ(Telangana)లోని రైతులకు వాతావరణ శాఖ(Meteorological Department) శుభవార్త చెప్పింది. మే చివరి వారంలో రాష్ట్రాన్ని పలకరించిన నైరుతి రుతుపవనాలు(Southwest monsoon) ఆ తర్వాత ముఖం చాటేశాయి. తొలకరి వానలకు విత్తనాలు విత్తకున్న రైతుల(Farmers)కు ఆ తర్వాత నిరాశ ఎదురైంది. ఎండలు తీవ్రంగా ఉండటంతో విత్తిన విత్తు భూమిలోనుంచి బయటికి రాకుండానే మాడిపోయింది. దీంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వర్షాలపై వాతావరణశాఖ(IMD) అప్డేట్ ఇచ్చింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతం(Northwest Bay of Bengal)లో అల్పపీడనం ఏర్పడినట్లు ప్రకటించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశలో కదిలి ఉత్తర ఒడిశా దాని సమీపంలోని ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా కదిలే అవకాశం ఉందని తెలిపింది.
అల్పపీడనం ప్రభావంతో..
వాయవ్య అరేబియన్ సముద్ర తీర ప్రాంతం(Arabian Sea coast) నుంచి ద్రోణి ఒకటి దక్షిణ గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మీదుగా వాయవ్య బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 – 7.6 కి.మీ మధ్యలో ఏర్పడిందని వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ(Telangana)లో 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40KM నుంచి 50KM వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
Mancherial got okayish rains right last 3days ?
Widespread rains occured around 40-50mm— Telangana Weatherman (@balaji25_t) June 26, 2025
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
కాగా ఇవాళ రాత్రి నుంచి ఆదిలాబాద్(Adilabad), కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ మూడు రోజుల పాటు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
Lot of improvement can be seen after 2days of good rains in TG. Of course, deficit still persists, but improved. TG had 88.7mm against normal of 109.3mm with -19% deficit so far
TERRIBLE STATE of rains for HYD with 30.1mm only so far against normal of 93.8mm with -68% deficit 😏… pic.twitter.com/mL0us4bVDe
— Telangana Weatherman (@balaji25_t) June 26, 2025