
Microsoft layoffs: ప్రపంచవ్యాప్తంగా ఆరు వేల మంది ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ (Microsoft) సంస్థ తొలగించింది. దీనికి కారణం మైక్రోసాప్ట్ లో కోడింగ్ లో 30 శాతం ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించడమే అని తెలుస్తోంది. ఇక్కడే ఒక ట్విస్టు వచ్చి పడింది. ఏఐ వినియోగాన్ని డెవలప్ చేయాలని మొదట ఉద్యోగులకు సూచనలు పై ఆఫీసర్లు సూచనలు చేయడంతో వారు దాన్ని కష్టపడి డెవలప్ చేశారు. ఇదే ఉద్యోగులు చేసిన తప్పు అయింది. తాము డెవలప్ చేసిన ఏఐతోనే తమ ఉద్యోగులకు ఎసరు తెచ్చుకున్నారు.
తాము తయారు చేసింది.. తమకే పెనుశాపమై
ప్రస్తుతం మనుషులతో కాకుండా ఏఐతో 30 శాతం కోడింగ్ రాయిస్తూ మైక్రో సాప్ట్ (Microsoft) ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది. ఏఐ వ్యవస్థలు రూపొందించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే (Software Engineers) దీనికి సంబంధించి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారని ఇంటర్నేషనల్ మీడియాలో (International media) కథనాలు రావడం సంచలనం కలిగిస్తోంది. ఏకంగా తన కంపెనీలో మూడు శాతం ఉద్యోగులను తొలగించడంతో మైక్రోసాప్ట్ ఏఐ ను ఎంతలా వాడుకుంటుందో అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు.
2023లో 10 వేల మంది.. ఇప్పుడు మూడు వేల పైనే..
వాషింగ్టన్‌లో (Washington) 40 శాతానికి పైగా ఉద్యోగులను తొలిగించగా అందులో ఎక్కువగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లే ఉండటం గమనార్హం. ఏఐ మెషీన్ పరికరాల వినియోగాలన్ని పెంచాలని సంస్థ చెప్పగా దానికి అనుగుణంగా ఉద్యోగులు కృషి చేసి పెంచారు. అనంతరం ఏఐ తో పనులు కానిచ్చేస్తున్న సంస్థ.. అందులోని ఉద్యోగులను మెల్లిమెల్లిగా తొలిగించేస్తోంది. టెక్నికల్ ప్రోగ్రామ్, జూనియర్ కోడర్స్ తో పాటు చివరకు ఏఐ డైరెక్టర్ కూడా తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. కాగా 2010లో 10 వేల మంది ఉద్యోగులకు మైక్రో సాఫ్ట్ ఉద్వాసన పలకగా.. ఆ తర్వాత ఇప్పుడే ఇంత పెద్ద స్థాయిలో ఉద్యోగులను తీసేయడం అని తెలుస్తోంది.