Mega DSc: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఈనెలలోనే మెగా డీఎస్సీ

ఏపీలోని నిరుద్యోగులకు(Unemployed in AP) మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఈ మార్చిలోనే మెగా డీఎస్సీ(Mega DSc) ఇస్తామని తెలిపారు. ఇవాళ అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు నారా లోకేశ్ సమాధానమిచ్చారు. హేతుబద్ధీకరణకు సంబంధించిన GO NO.117ను రద్దు చేసి, దానికి ప్రత్యామ్నాయంగా పలు విధానాలు తెస్తామని చెప్పారు. టీచర్ల బదిలీల చట్టం(Teachers Transfer Act)తో పాటు వారికి ప్రమోషన్లు(Promotions), పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలపై పలు విషయాలు తెలిపారు. తమ ప్రభుత్వం APలో రాజకీయాలకు అతీతంగా విద్యా రంగాన్ని అభివృద్ధి చేస్తోందని అన్నారు.

Nara Lokesh: The Future of Education in Andhra Pradesh - Telugumopo -  Movies and Politics

నూతన సంస్కరణలకు శ్రీకారం

భారత్‌(India)లోనే ఏపీ విద్యా వ్యవస్థ(AP Education System)ను అగ్రస్థానంలో నిలపాలన్న CM చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తామని, ఇందుకు తగ్గ సంస్కరణలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. G.O 117 వల్ల కలిగిన ప్రతికూల ఫలితాల గురించి గతంలో చాలా మంది తన దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. ఆ జీవో పేరుతో గత YCP సర్కారు చేసిన నిర్వాకం వల్ల అప్పట్లో సర్కారు స్కూళ్లలో 12 లక్షల మంది విద్యార్థులు(Students) తగ్గిపోయారన్నారని తెలిపారు.

త్వరలోనే పాఠ్యపుస్తకాల్లో మార్పులు

అలాగే త్వరలోనే అన్ని తరగతుల పాఠ్యపుస్తకాల్లో మార్పులు తెస్తామని స్పష్టం చేశారు. ఆదర్శ పాఠశాలల(Ideal schools)తో పాటు ఇతర ఉన్నత పాఠశాలలు ఏయే విద్యార్థులకు ఇంటి నుంచి చాలా దూరం ఉంటున్నాయో వారికి రవాణా భత్యం(Transport Allowance) ఇస్తామన్నారు. వీలైనంత త్వరలోనే సర్కారు విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తామని లోకేశ్ చెప్పారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *