దేశవ్యాప్తంగా చలామణిలో ఉన్న రూ.500 నోట్ల సరఫరాను నిలిపివేయనున్నారంటూ సోషల్ మీడియా(Social Media)లో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. రూ.500 నోట్ల(Notes)ను ఆపే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని స్పష్టం చేసింది. ATMలలో రూ.500 నోట్ల జారీ యథావిధిగా కొనసాగుతుందని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. ఈ విషయంపై ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి(Minister of State for Finance Pankaj Chaudhary) రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రజల లావాదేవీల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, రిజర్వ్ బ్యాంక్ (RBI)తో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఏ నోట్లను ఎంత మేర ముద్రించాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఆయన వివరించారు. రూ.500 నోట్ల సరఫరాను నిలిపివేస్తున్నట్లుగా వాట్సాప్‌లో వస్తున్న సందేశాలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు.

అయితే, ప్రజలకు రూ.100, రూ.200 వంటి చిన్న డినామినేషన్ నోట్ల(Denomination notes) లభ్యతను పెంచేందుకు RBI చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా, ఈ ఏడాది ఏప్రిల్ 28న ఇహఉ ఒక సర్క్యులర్ జారీ చేసిందని గుర్తుచేశారు. దాని ప్రకారం, అన్ని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు(White Label ATM Operators) తమ ఏటీఎంలలో రూ.100, రూ.200 నోట్లను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని ఆదేశించినట్లు చెప్పారు.
ఫేక్ న్యూస్‌పై స్పందించిన ఫ్యాక్ట్ చెక్ యూనిట్
సెప్టెంబర్ 30 నాటికి దేశంలోని 75 శాతం ATMలలో కనీసం ఒక క్యాసెట్ నుంచి రూ.100 లేదా రూ.200 నోట్లు వచ్చేలా చూడాలని, అలాగే వచ్చే ఏడాది మార్చి 31 నాటికి 90 శాతం ఏటీఎంలలో ఈ సౌకర్యం కల్పించాలని RBI లక్ష్యంగా నిర్దేశించిందని పంకజ్ చౌదరి తన సమాధానంలో పేర్కొన్నారు. కాగా, సెప్టెంబర్ 30 నుంచి ఏటీఎంలలో రూ.500 నోట్లు నిలిచిపోతాయని, ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకోవాలని సూచిస్తూ వాట్సాప్‌లో ఓ సందేశం విస్తృతంగా వ్యాపించింది. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ కూడా స్పందించింది.
*Rs 500 Notes to Be Withdrawn Soon? Here’s What RBI and Govt Say*#Rs500Note #IndianCurrency #ATMCash #RBIUpdatehttps://t.co/7e0dh6fNP3
— Munsif News 24×7 (@MunsifNews24x7) August 5, 2025






