Mirai: భారీ విజువల్ ఎఫెక్ట్స్.. ఆకట్టుకుంటున్న మిరాయ్‌ టీజర్

హను మాన్తో బ్లాక్బస్టర్ విజయాన్నందుకున్న యువ నటుడు తేజ సజ్జా (Teja Sajja) ప్రధానపాత్రలో రూపొందుతున్న మూవీ ‘మిరాయ్‌’ (Mirai). కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా టీజర్ను తాజాగా చిత్రబృందం రిలీజ్ చేసింది. ‘జరగబోయేది మారణహోమం.. శిథిలం కాబోతోంది అశోకుడి ఆశయం.. కలియుగంలో పుట్టిన ఏశక్తీ దీన్ని ఆపలేదు..’ అంటూ ఆసక్తికర డైలాగులతో టీజర్‌ ఆకట్టుకునేలా ఉంది. ఇందులో విజువల్స్ భారీ స్థాయిలో ఉన్నాయి. మిరాయ్లో రితికా నాయక్ (Ritika Nayak) హీరోయిన్గా నటిస్తుండగా.. మంచు మనోజ్‌ (Manchu Manoj), శ్రియా శరణ్, జగపతి బాబు, జర్మనీ నటి తంజా కెల్లర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సెప్టెంబర్‌ 5న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://youtu.be/nsqHCfO1ayQ?si=eYkPvJvlhrM7xmIM

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *