
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections 2025) నగారా మోగింది. ఈ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీ, తెలంగాణలో మూడు చొప్పున స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించి.. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ప్రకటించింది.
తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు
తెలంగాణలో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు (Teacher MLC Election) జరగనున్న విషయం తెలిసిందే. మరోవైపు అదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. మరోవైపు వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది.
ఏపీలో రెండు స్థానాలకు ఎన్నికలు
మరోవైపు ఏపీలో ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు (Graduate MLC Elections 2025) జరగనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది.
ఎమ్మెల్సీ ఎన్నికల ముఖ్య తేదీలు ఇవే
- ఎన్నికల నోటిఫికేషన్ – ఫిబ్రవరి 3
- ఎన్నికల పోలింగ్ – ఫిబ్రవరి 27
- ఓట్ల లెక్కింపు – మార్చి 3