మొబైల్ యూజర్ల(Mobile Users)కు కంపెనీలు షాక్ ఇవ్వనున్నాయా? అంటే అవుననే తెలుస్తోంది. త్వరలోనే మొబైల్ ఆపరేటింగ్ సంస్థలు రీఛార్జీల ధరలు(Recharge rates hike) పెంచనున్నట్లు టెక్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు భారత్‌లోనూ స్మార్ట్ ఫోన్ల వినియోగమూ విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు 1GB డేటా మాత్రమే వినియోగించేవారు. కానీ ఇప్పుడు రోజు 2,3GBల డేటా కూడా సరిపోవడం లేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. దీనిని క్యాష్ చేసుకోవాలనే ఆలోచనలో మొబైల్ కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక కంపెనీ రేట్లను పెంచితే మిగిలిన అన్ని నెట్‌వర్కింగ్ కంపెనీలు(Networking companies) తమ రీఛార్జ్ ప్లాన్ల రేట్లను పెంచే అవకాశాలు ఉన్నాయి.
వినియోగదారులకు షాకిచ్చిన జియో
కాగా టెక్ యుగంలో జియో(Reliance Jio) ఓ సంచలనం సృష్టించింది. తక్కువ మొత్తంతో ఎక్కువ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో అన్ని సర్వీస్ ప్రొవైడర్లు జియోకి కన్వర్ట్ అయ్యారు. అయితే గత ఏడాది జియో సైతం రేట్లు పెంచి వినియోగదారులకు షాకిచ్చింది. జియో ఈ స్థాయిలో రేట్లను పెంచడం ఏంటి అంటూ కొందరు BSNLకి మారాలని నిర్ణయించుకున్నారు. లక్షల మంది జియో యూజర్లు వెళ్లి పోయారు అంటూ ప్రచారం జరిగింది. అయినా కొత్తగా జియోకు వచ్చిన వారు అదే స్థాయిలో ఉన్నారు. కేవలం JIO, AIRTEL మాత్రమే నాణ్యమైన నెట్‌ను ఇస్తున్న కారణంగా ఆ నెట్‌వర్క్‌లు ఎంతగా డేటా రేటు పెంచినా కూడా రీఛార్జ్ విషయంలో అస్సలు తగ్గడం లేదు.

ఆ రెండు కంపెనీలకే అధిక లాభం?
2024లో DATA రేట్లను పెంచిన మొబైల్ ఆపరేటింగ్ సంస్థలు మరోసారి రీఛార్జ్ రేట్లను పెంచే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. డేటా రేట్ల విషయంలో ఇప్పటికే వినియోగదారుల నెత్తిన పెద్ద బండరాయి పెట్టినట్లుగా గత ఏడాది పెంపుదల ఉంది. ఇప్పుడు మరోసారి రీచార్జ్ ధరల(Recharge rates)ను పెంచబోతున్నట్లు తెలుస్తోంది. 2025లో అన్ని కంపెనీలు సగటున 10% రేట్లను పెంచేందుకు గాను సిద్ధం అవుతున్నాయి. ఒకటి రెండు వారాల్లో ఈ నిర్ణయంను ఏదో ఒక కంపెనీ వెలువరించే అవకాశం ఉంది. ఇండియాలో అత్యధిక కస్టమర్స్ ఉన్న AIRTEL, JIO సంస్థలు రేట్ల పెంపు వల్ల దాదాపు 25% మేర అధిక లాభాలను దక్కించుకునే వీలుంది.








