Mana Enadu : ‘సలార్’, ‘కల్కి’ సినిమాల బ్లాక్ బస్టర్ హిట్ల జోష్ లో ఉన్న పాన్ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగైదు సినిమాలున్నాయి. సలార్-2, కల్కి-2, రాజాసాబ్, స్పిరిట్ (Spirit), ఫౌజీ సినిమాలతో డార్లింగ్ బిజీబిజీగా ఉన్నాడు. అయితే ఈ చిత్రాల్లో ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ‘స్పిరిట్’. యానిమల్ తో క్రేజీ హిట్ కొట్టిన డాషింగ్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా(Sandeep Reddy Vanga)తో ప్రభాస్ ఈ సినిమా తీస్తున్నాడు. పాన్ వరల్డ్ రేంజ్లో తెరకెక్కించనున్న ఈ చిత్రంలో ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీసు పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
స్పిరిట్ లో బాలీవుడ్ స్టార్స్
ప్రభాస్ పాత్ర గురించి తప్ప ఈ సినిమా గురించి ఇప్పటి వరకు అధికారిక అప్డేట్ ఏదీ రాలేదు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ముచ్చట నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది పట్టాలెక్కనున్నట్లు సమాచారం. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan), కరీనా కపూర్ (Kareena Kapoor) సినిమాలో నటించనున్నట్లు చాలా రోజుల నుంచి టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే మరో స్టార్ హీరో ఈ సినిమాలో నటించనున్నట్లు ఇప్పుడు ఓ వార్త వైరల్ అవుతోంది.
ప్రభాస్ తో మెగాస్టార్
మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి () ప్రభాస్ సినిమాలో నటించనున్నారని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో ఆయన భాగం కానున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయాన్ని మేకర్స్ కన్ఫార్మ్ చేయాల్సి ఉంది. ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ సంయుక్తంగా రూపొందిస్తున్నాయి.