హిందువులపై హింస పాకిస్థాన్‌లో (Pakistan) కన్నా బంగ్లాదేశ్‌లో ఎక్కువగా జరుగుతోందని భారత (India) ప్రభుత్వం తెలిపింది. 2024లో హిందువులపై హింసాత్మక ఘటనలకు సంబంధించిన కేసులు బంగ్లాదేశ్‌లో 2,200, పాక్‌లో 112 వెలుగులోకి వచ్చినట్లు పేర్కొంది. హిందువులపై హింస పాకిస్థాన్‌లో కన్నా బంగ్లాదేశ్‌లో ఎక్కువగా జరుగుతున్నదని భారత ప్రభుత్వం తెలిపింది. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత హిందువులపై హింస విపరీతంగా పెరిగిందని తెలిపింది. 2022లో వీరిపై హింసాత్మక సంఘటనలు (Bangladesh riots) బంగ్లాదేశ్‌లో 241, పాక్‌లో 47 జరిగాయని, 2023లో బంగ్లాదేశ్‌లో 302, పాకిస్థాన్‌లో 103 జరిగాయని పేర్కొంది. విదేశాంగ శాఖ రాజ్యసభకు (Parliament) ఈ వివరాలు తెలిపింది.
షేక్ హసీనా రాజీనామాతో పెరిగిన దాడులు
విద్యార్థుల ఉద్యమంతో మొదలైన హింస ప్రధాని షేక్ హసీనా రాజీనామా వరకు వెళ్లింది. అయితే చివరకు ఆమె పారిపోయి ఇండియాకు రావడం తలదాచుకోవడం జరిగింది. అయితే షేక్ హసీనా (Sheikh Hasina) దేశం వదిలి పారిపోయిన తర్వాత బంగ్లాదేశ్ (Bangladesh) లో హింస చెలరేగింది. దీంతో ఎక్కువ మంది హిందువులపై హిందు ఆలయాలపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఎక్కువ మంది మైనార్టీలు చనిపోయినట్లు కూడా ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.
చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్టుతో మరింత ఉద్రిక్తత
హిందువులు, మైనార్టీలపై వరుస దాడులతో బంగ్లాదేశ్ (Bangladesh)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంతమంది ఎంపీలు దేశం విడిచి పారిపోయారు. షేక్ హసీనా పార్టీకి చెందిన వ్యక్తులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇస్కాన్ కు చెందిన అనేక టెంపుల్స్ ను నిరసనకారులు తగలబెట్టారు. ఇస్కాన్ లీడర్ చిన్మయి కృష్ణదాస్ బంగ్లాదేశ్ జాతీయ జెండాను దూషించాడనే కేసులో అరెస్టు చేశారు. ఆయన తరఫున లాయర్ గా వాదించేందుకు వచ్చిన వ్యక్తిని కోర్టు ఎదుటే హత్య చేశారు. ఆ సమయంలో బంగ్లాదేశ్ లో తీవ్ర అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ బంగ్లాదేశ్ లో హిందువులపై, మైనార్టీలపై దాడులు కొనసాగుతున్నాయని రాజ్యసభలో భారత ప్రభుత్వం లెక్కలతో సహా పేర్కొనడం గమనార్హం






