లేడీ సూపర్‌స్టార్ నయనతార(Nayanthara)ను మరిన్ని వివాదాలు చుట్టుముడుతున్నాయి. నయన్ వెడ్డింగ్ డాక్యుమెంటరీ ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’లో (Nayanthara: Beyond the Fairytale) తన పర్మిషన్ లేకుండా తాను నిర్మాతగా వ్యవహరించిన ‘నానుమ్ రౌడీ దాన్’ మూవీ విజువల్స్ ను వాడుకున్నందుకు దానికి నిర్మాతగా వ్యవహరించిన ప్రముఖ యాక్టర్ ధనుష్ దావా వేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో మూవీ బృందం నయన్‌పై కేసు వేసేందుకు సిద్ధమైంది. 2005 రిలీజైన బ్లాక్ బస్టర్ మూవీ ‘చంద్రముఖి’ (Chandramukhi) మూవీ మేకర్స్.. నయనతారతో పాటు నెట్‌ఫ్లిక్స్ కు లీగల్ నోటీసు జారీ చేసినట్లు సమాచారం. ఎలాంటి అనుమతి లేకుండా చంద్రముఖి మూవీ క్లిప్‌ను డాక్యుమెంటరీలో వాడుకున్నందుకు రూ.5 కోట్ల పరిహారం డిమాండ్ చేసినట్లు తెలిసింది. అయితే దీనిపై ఇప్పటి వరకు నయనతార స్పందించలేదు.
అనుమతి తీసుకోనందుకే..
‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’ పేరుతో నటి నయనతార, ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్ (vignesh shivan) శివన్ ఓ డాక్యుమెండరీని గతంలో రిలీజ్ చేశారు. ఇది ప్రముఖ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫారం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రదర్శితమవుతోంది. అయితే తాను నిర్మాతగా వ్యవహరించిన ‘నానుమ్ రౌడీ దాన్’ మూవీ విజువల్స్‌ను పర్మిషన్ లేకుండా డాక్యుమెంటరీలో వాడుకోవడంతో ఆ మూవీ నిర్మాత, ప్రముఖ యాక్టర్ ధనుష్ (Dhanush) సీరియస్ అయ్యారు. ఆ దంపతులపై గత నవంబర్‌లో దావా వేశారు. ఆయన నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. నయన్ దంపతులతోపాటు వారికి చెందిన రౌడీ పిక్చర్స్‌పై దావా వేసింది.
డాక్యుమెంటరీ ట్రైలర్‌లో మూడు సెకన్ల సీన్స్
అయితే తమకెంతో ముఖ్యమైన ‘నానుమ్ రౌడీ దాన్’ విశేషాలను తన డాక్యుమెంటరీలో చూపించాలని కోరినా.. చిత్ర నిర్మాత ధనుష్ నుంచి పర్మిషన్ రాలేదని అందుకు తాను ఎంతో బాధపడ్డానని అంతకుముందు నయనతార ఒక బహిరంగ లేఖ రిలీజ్ చేశారు. డాక్యుమెంటరీ ట్రైలర్‌లో మూడు సెకన్ల సీన్స్ ఉపయోగించినందుకు పరిహారంగా ఆయన రూ.10 కోట్లు డిమాండ్ చేశారని తెలిపారు. తనపై ధనుష్ ద్వేషం కనబరుస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.






