Devara:దేవ‌ర ఓటీటీ రిలీజ్ డేట్ అప్పుడే

ManaEnadu:యంగ్ టైగర్ ఎన్టీయార్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర సూపర్ హిట్ టాక్ తో దుసుకెళ్తోంది. రిలీజ్ అయి 18 రోజులు గడుస్తున్న కూడా దేవర వసూళ్లు ఏ మాత్రం తగ్గలేదు. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా దసరా కానుకగా రిలీజ్ కాబడిన సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. యంగ్ టైగర్ నటన, యాక్షన్ సీన్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.దేవర విజయంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

దేవర మేకర్స్ సమాచారం ప్రకారం నవంబరు 8న దేవర డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అవనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారక ప్రకటన రానుంది. ఇప్పటికి థియేటర్స్ లో దంచి కొడుతున్న దేవర డిజిటల్ స్ట్రీమింగ్ ను మరో రెండు వారలు వెనక్కు వేయాలని థియేటర్స్ యాజమాన్యాలు కోరుతున్నాయి.

దేవర డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడు వస్తుందా అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. దేవర డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్. సో దేవర ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తే నెట్ ఫ్లిక్స్ లోనే వస్తుంది. కాగా దేవర డిజిటల్ రైట్స్ అమ్మకాలు చేసినప్పుడ థియేటర్స్ లో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత మాత్రమే ఓటీటీ రిలీజ్ చేసేలా డీల్ చేసారు మేకర్స్. దేవర గత నెల 27న రిలీజ్ అయింది., ఆ లెక్కన 8 వారలు అంటే నవంబరు రెండవ వారంలో ఓటీటీ రిలీజ్ వస్తుంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *