
తెలుగుతోపాటు తమిళ, హిందీ మూవీస్ చేస్తూ బిజీగా గడుపుతోంది మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). ప్రస్తుతం ఆమె అడివి శేష్ (Adivi sesh)తో ‘డెకాయిట్’ మూవీలో యాక్ట్ చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఈ మూవీ టీమ్ మృణాల్కు స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఆగస్టు 1న మృణాల్ బర్త్ డేను పురస్కరించుకొని సెట్లో ప్రీబర్త్ డే సెలబ్రేషన్స్ చేశారు.
హ్యాపీ బర్త్ డే సరస్వతి..
మృణాల్కు తెలియకుండా కేక్ తీసుకొచ్చి హీరో అడవి శేష్ తోపాటు టీమ్ సభ్యులంతా సర్ ప్రైజ్ ఇచ్చారు. గది తలుపు తట్టి బయటకు తీసుకొచ్చి సర్ ప్రైజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. కేక్ కట్ చేసిన నటి.. సందడి చేశారు. టీమ్ తో కలిసి డ్యాన్స్ చేశారు. ‘హ్యాపీ బర్త్ డే సరస్వతి’ అంటూ అందరూ విష్ చేశారు. దీంతో ఈ సినిమాలో మృణాల్ క్యారెక్టర్ పేరు సరస్వతి అని తెలుస్తోంది.
కీలక పాత్రల్లో అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్..
షానీల్ డియో డైరెక్షన్ లో రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ‘డెకాయిట్’ (Dacoit: A Love Story) మూవీ తెరకెక్కుతోంది. డిసెంబర్ 25న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap), ప్రకాశ్ రాజ్, సునీల్ అతుల్ కులకర్ణి కీలక క్యారెక్టర్స్ లో కనిపించనున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. అన్నపూర్ణ బ్యానర్లో నటి సుప్రియ యార్లగడ్డ (Supriya Yarlagadda) నిర్మిస్తున్నారు.
View this post on Instagram