బాలీవుడ్, టాలీవుడ్‌లలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన మృణాల్ ఠాకూర్(Mrinal Thakur), తమిళ స్టార్ హీరో ధనుష్(Dhanush)తో డేటింగ్ రూమర్స్(Dating rumors)పై తాజాగా స్పందించింది. ఇటీవల మృణాల్ పుట్టినరోజు(Birthday Celebrations) వేడుకల్లో ధనుష్ సన్నిహితంగా కనిపించడం, వీరిద్దరూ చేతులు పట్టుకుని మాట్లాడుకుంటూ కనిపించిన వీడియోలు సోషల్ మీడియా(SM)లో వైరల్ కావడంతో ఈ రూమర్స్ ఊపందుకున్నాయి. ‘తేరే ఇష్క్ మే’ సినిమా పార్టీలోనూ వీరు కలిసి కనిపించడంతో ప్రేమ వార్తలు మరింత జోరుగా వ్యాపించాయి. తాజాగా మృణాల్ ఠాకూర్ ఈ వార్తలపై స్పందించింది. ధనుష్‌తో తనకు ఎలాంటి వ్యక్తిగత సంబంధం లేదని తేల్చిచెప్పింది.
అధికారికంగా కన్ఫామ్ అయితే కానీ..
“మేము కేవలం సినిమా సందర్భంగా కలిశాం. ఈ రూమర్స్‌లో నిజం లేదు. సోషల్ మీడియా(SM) చిన్న విషయాన్ని పెద్దగా చూపిస్తుంది. నా కెరీర్లో నేను సాధించాల్సింది, చూడాల్సినది చాలా ఉంది. ఏదైనా ప్రాజెక్ట్(Project) విషయంలో అధికారికంగా కన్ఫామ్ అయితే కానీ నేను దానిపై మాట్లాడను. కానీ SMలో చాలా ముందే అనవసర ప్రచారం సాగిస్తారు. నేను నిజంగా కమిటైతే అప్పుడు చెప్పాలి. అనవసరంగా అపహాస్యం చేయకూడదు’ అని మృణాల్ అన్నారు. ధనుష్ కూడా ఈ గాసిప్స్‌ను ఖండిస్తూ, తాము కేవలం ప్రొఫెషనల్ స్నేహితులమని స్పష్టం చేశాడు. మృణాల్ ప్రస్తుతం అడివి శేష్‌తో ‘డెకాయిట్’ సినిమాతో బిజీగా ఉంది. ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది. ధనుష్ ‘ఇడ్లీ కడై’ సినిమా పోస్ట్-ప్రొడక్షన్‌లో ఉన్నాడు. ఈ రూమర్స్‌తో అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
Amid Dating Rumours With Dhanush, Mrunal Thakur Reveals Why She Doesn’t Talk About Her Plans! – https://t.co/tGNdnggltS #Dhanush #Entertainment #MrunalThakur #SonOfSardaar2 pic.twitter.com/OMp8Y1W4gB
— Hauterrfly (@thehauterrfly) August 6, 2025






