
తెలుగు, హిందీ చిత్రసీమలో తన నటనతో గుర్తింపు పొందిన యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrinal Thakur) తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సీతారామం(Sitharamam)’, ‘హాయ్ నాన్న’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ మరాఠీ భామ, తనకు త్వరలో పెళ్లి చేసుకుని, పిల్లలను కనాలనే కోరిక ఉన్నట్లు వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, మాతృత్వం ఆడవారికి గర్వకారణమని, తనకూ అమ్మ అని పిలిపించుకోవాలని ఉందని చెప్పింది.
View this post on Instagram
పెళ్లి తర్వాత సినీ అవకాశాలు తగ్గుతాయి
మృణాల్ మాట్లాడుతూ, “పెళ్లి చేసుకుని, భర్త, పిల్లలతో కలిసి జీవితాన్ని ఆనందించాలని కలలు కంటున్నాను. కానీ, ప్రస్తుతం నా ఫోకస్ పూర్తిగా కెరీర్‌పైనే ఉంది. ఇండస్ట్రీలో ఇంకా చాలా సాధించాలనుకుంటున్నాను” అని తెలిపింది. ఆమె ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత హీరోయిన్లకు అవకాశాలు తగ్గే ఛాన్స్ ఉంటుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, మృణాల్ తెలివిగా కెరీర్‌పై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం మృణాల్, అడివి శేష్(Adavi Sesh)తో ‘డెకాయిట్’ చిత్రంలో నటిస్తుంది. బాలీవుడ్‌లోనూ ‘సన్ ఆఫ్ సర్దార్-2’ వంటి ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. తెలుగులో తన కెరీర్‌ను మరింత బలోపేతం చేసుకోవడానికి ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఆకట్టుకుంటున్నాయి.
మృణాల్ బర్త్ డే పార్టీకి ధనుష్
కాగా ఇటీవల మృణాల్ బర్త్ డే పార్టీలో ధనుష్ కనిపించాడు. ధనుష్(Dhanush) మృణాల్ బర్త్ డే పార్టీలో కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే కొంతమంది మాత్రం త్వరలో ఈ ఇద్దరూ కలిసి నటించనున్నారని అంటున్నారు. ధనుష్ రాబోయే సినిమాలో మృణాల్ హీరోగా నటిస్తుంది కాబోలు అందుకే ఆమె బర్త్ డే పార్టీకి ధనుష్ వచ్చాడు అని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.