Venkatesh-Trivikram: వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో మూవీ.. అభిమానులకు పండగే!

హీరో విక్టరీ వెంకటేష్(Victory Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) కాంబోలో సినిమా రాబోతోంది. కొన్ని రోజులుగా ఈ మూవీపై వస్తున్న బజ్‌పై తాజాగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావడంతో సినీ అభిమానులు(Fans) ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇద్దరు దిగ్గజాల కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రం హైదరాబాద్‌(Hyderabad)లో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్(Harika and Hassine Creations) బ్యానర్‌పై నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చిన్నబాబు) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సురేష్ బాబు(Suresh Babu) కెమెరా స్విచ్ ఆన్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ అధికారికంగా పట్టాలెక్కింది. ఈ మూవీ ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని, త్రివిక్రమ్ సిగ్నేచర్ స్టైల్‌లో ఎమోషనల్ డైలాగ్స్, హాస్యం, కుటుంబ భావోద్వేగాల మిశ్రమంతో ప్రేక్షకులను అలరించనుందని తెలుస్తోంది.

Venkatesh and Trivikram Film Launched - Telugu360

2026 వేసవిలో విడుదలకు ప్లాన్

ఇక వెంకటేష్ గతంలో “నువ్వు నాకు నచ్చావ్”, “మల్లీశ్వరి(Mallishwari)” వంటి సూపర్ హిట్ చిత్రాలకు త్రివిక్రమ్ కథ, మాటలు అందించారు. ఇప్పుడు మొదటిసారిగా వీరిద్దరూ నటుడు-దర్శకుడిగా కలిసి పనిచేయడం అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేసింది. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 2025లో ప్రారంభం కానుంది. ఇక 2026 వేసవిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. సంగీత దర్శకుడిగా తమన్ ఈ ప్రాజెక్ట్‌లో చేరారు. అయితే మిగతా నటీనటుల వివరాలు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

కాగా వెంకటేష్(Venkatesh) ఇటీవల “సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam)” చిత్రంతో రూ. 300 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు, ఇది ఈ కాంబినేషన్‌పై మరింత ఆసక్తిని కలిగించింది. త్రివిక్రమ్ మార్క్ కామెడీ, ఎమోషనల్ డ్రామాతో కూడిన ఈ చిత్రం తెలుగు సినిమా ప్రేక్షకులకు మరో మరపురాని అనుభవాన్ని అందించనుంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *