Mumbai Indians: ఉత్కంఠ పోరులో ముంబై విజయం.. రేపు పంజాబ్‌తో ఢీ

వారెవ్వా వాట్ ఏ మ్యాచ్.. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఎలిమినేటర్ మ్యాచ్ అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్ చేసింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచులో చివరకు విజయం ముంబై ఇండియన్స్‌(MI)నే వరించింది. ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం రాత్రి ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్(MI vs GT) జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో ముంబై 20 రన్స్ తేడాతో విజయం సాధించి క్వాలిఫయర్-2కి అర్హత సాధించింది. ఆ మ్యాచులో ముంబై జట్టు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్‌(PBKS)ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు జూన్ 3న జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్(RCB) బెంగళూరును ఢీకొంటుంది.

కీలక పోరులో రో‘హిట్’.. 

కాగా చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్(Mullanpur) వేదికగా జరిగిన ఈ ఈ కీలక పోరులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (81), జానీ బెయిర్ స్టో (47) ముంబైకి మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత సూర్యకుమార్ (33), తిలక్ వర్మ (25), పాండ్య (22), నమన్ ధీర్ (9) రన్స్ చేయడంతో ముంబై భారీ 228/5 స్కోరు చేసింది. జీటీ బౌలర్లలో ప్రసిధ్ 2, సాయి కిశోర్ 2, సిరాజ్ ఒక వికెట్ తీశారు.

Image

సుదర్శన్, సుందర్ పోరాడినా..

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్(GT) పోరాడినప్పటికీ, 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు మాత్రమే చేయగలిగింది. టైటాన్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ గిల్ (1) త్వరగా ఔటయ్యాడు. అయితే, సాయి సుదర్శన్(80) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. మెండిస్ (20) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేక హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. వాషింగ్టన్ (24 బంతుల్లో 48 రన్స్) మెరుపు ఇన్నింగ్స్‌తో విజయానికి చేరువ చేసే ప్రయత్నం చేశాడు. రూథర్‌ఫోర్డ్ (24) కూడా ఫర్వాలేదనిపించాడు. చివర్లో రాహుల్ తెవాటియా (16*), షారుఖ్ ఖాన్ (13*) ప్రయత్నించినా, ముంబై బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు వారి పోరాటం సరిపోలేదు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2 కీలక వికెట్లు పడగొట్టగా, బుమ్రా, గ్లీసన్, శాంట్నర్, అశ్వనీ కుమార్ తలో ఒక వికెట్ తీశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *