Mana Enadu : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, తమిళ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ (AR Murugadas) కాంబోలో ‘సికందర్ (Sikandar)’ అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతోందనే ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా స్టోరీ గురించి నెట్టింట ఓ ప్రచారం మొదలైంది. ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హంటింగ్ ఎపిసోడ్ యాడ్ చేయనున్నట్లు బీ టౌన్ మీడియా కోడై కూస్తోంది.
సల్మాన్ రిస్క్ చేస్తున్నాడా?
అయితే సికందర్ సినిమాలో బిష్ణోయ్ గ్యాంగ్ (Bishnoi Gang) హంటింగ్ సీన్ సల్మాన్ ఖాన్ (Salman Khan) కు రియల్ లైఫ్ లో ముప్పు తెచ్చిపెట్టనుందా అని ఇప్పుడు భాయ్ జాన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. చాలా ఏళ్లుగా సల్మాన్ ఖాన్ పై బిష్ణోయ్ గ్యాంగ్ గురి పెట్టిన విషయం తెలిసింది. ఇప్పటికే పలుమార్లు హత్యాయత్నం కూడా చేయగా త్రుటిలో తప్పించుకున్నాడు సల్లూ భాయ్. ఇటీవల కూడా టార్గెట్ సల్మాన్ ఖాగా.. బాబా సిద్దిఖీ బిష్ణోయ్ గ్యాంగ్ అటాక్ కు బలైయ్యారు.
The wait is now over! A glimpse into Sikandar’s world is here… See you all in cinemas this Eid! ♥️🔥 #SikandarTeaser Out Now! https://t.co/FTS1FnLxsh #SajidNadiadwala’s #Sikandar @BeingSalmanKhan @iamRashmika @DOP_Tirru @ipritamofficial @Music_Santhosh @NGEMovies… pic.twitter.com/gwzHPTBpWJ
— A.R.Murugadoss (@ARMurugadoss) December 28, 2024
సారీ చెబితే వదిలేస్తాం
ఇక సల్మాన్ ఖాన్ ను చంపేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ ఎప్పటికప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంది. అందుకే భాయ్ జాన్ సెక్యూరిటీ లేకుండా ఇల్లు దాటని పరిస్థితి ఏర్పడింది. ఇంటి బాల్కనీలో ఉండటం కూడా ఇప్పుడు ఆయనకు ప్రమాదకరంగా మారింది. ఇక సల్మాన్ ను చంపేస్తామంటూ బెదిరింపు ఈ మెయిల్స్, సోషల్ మీడియా హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. క్షమాపణలు చెబితే వదిలేస్తామంటూ బ్లాక్ మెయిలింగ్ కు దిగారు.
సల్మాన్ రియల్ లైఫ్ సంఘటనలు
ఇదంతా ఇప్పుడు సికందర్ సినిమాలో చూపించాలని మురుగదాస్ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమా స్టోరీ సల్మాన్ ఖాన్ రియల్ లైఫ్ లో జరిగిన సన్నివేశాలకు దగ్గరంగా ఉండనుందనే ప్రచారం ఊపందుకుంది. ముంబయి మాఫియా బ్యాక్ డ్రాప్ లో సినిమాలు రావడం కొత్తేం కాదు. ఇప్పటికే ఛోటా రాజన్, దావూద్ ఇబ్రహీం కథలు ప్రపంచానికి తెలిసినవే. అయితే సల్మాన్ సికందర్ మూవీ గురించి వైరల్ అవుతున్న ఈ న్యూస్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.






