కొంతకాలంగా టాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీని ఓ వైపు తమన్ (SS Thaman) మరోవైపు కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ (Anirudh Ravichandran) ఏలుతున్నారు. స్టార్ హీరోలంతా తమ సినిమాలకు వీరితో మ్యూజిక్ చేయించాలని క్యూ కడుతున్నారు. అయితే ఒకప్పుడు టాలీవుడ్ ను ఏలిన రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ తాజాగా తండేల్ మూవీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. కొంతకాలంగా ఫేడ్ అవుట్ అయిన డీఎస్పీ బుజ్జితల్లీ అంటూ ‘తండేల్ (Thandel)’తో మళ్లీ ఇండస్ట్రీని ఏలేందుకు వచ్చేశాడు.
నేను రీమేక్స్ చేయను
తాజాగా ఆయన (Devi Sri Prasad) ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చాలా ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. ట్యూన్ కాపీ చేయడం.. ట్యూన్ విని ఇన్‌స్పైర్ కావడం రెండూ వేర్వేరు అని ఆయన స్పష్టం చేశాడు. ఒక పాటను విని స్ఫూర్తి పొందడం అంటే.. అలాంటి పాటను మరో దాన్ని చేయడం కానీ కాపీ కొట్టడం కాదని తెలిపాడు. తన పాటలను చాలామంది కాపీ కొట్టి తనను చూసి ఇన్‌స్పైర్ అయ్యానని చెప్పారని వెల్లడించాడు. తాను కాపీ కొట్టనని.. రీమేక్స్ చేయనని డీఎస్పీ క్లారిటీ ఇచ్చారు. ‘గద్దలకొండ గణేష్ (Gaddalakonda Ganesh)’ సినిమాలో ఒకపాట రీమేక్ చేయమని అడిగితే చేయనని చెప్పి ఆ సినిమానే వదులుకున్నట్లు తెలిపారు.
అంతకంటే గొప్ప ప్రశంస ఉంటుందా?
“నేను పని చేసిన డైరెక్టర్లంతా నా అభిప్రాయాలను గౌరవిస్తారు. ఉప్పెన (Uppena) సినిమాలో నీ కన్న నీలి సముద్రం పాటకు ట్యూన్ విన్న సుకుమార్ (Sukumar) అసూయగా ఉందన్నారు. బుచ్చిబాబు తన శిష్యుడు కాబట్టి ఈ ట్యూన్ ఇచ్చానని లేదంటే తన సినిమాలోనే పెట్టుకునే వాడినని అన్నారు. అంతకంటే పెద్ద ప్రశంస ఉంటుందా.. ఇక అదే మూవీలో జలజలజలపాతం సాంగ్ విన్న బుచ్చిబాబు నా సినిమా నా కంటే మీకే బాగా అర్థమైందని అన్నారు.” అని దేవీశ్రీ ప్రసాద్ చెప్పుకొచ్చాడు.






