మయన్మార్ (Myanmar), థాయ్‌లాండ్‌లలో శుక్రవారం రోజున రెండు భారీ భూకంపాలు (Earthquake) విలయం సృష్టించాయి. ఈ ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే ఈ ఘటనలో మృతుల సంఖ్య వేయి దాటినట్లు సమాచారం. ఈ సంఖ్య 10వేలు దాటే అవకాశం ఉందని అమెరికా ఏజెన్సీ తెలిపింది. ఈ భారీ ప్రకంపనల ధాటికి తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. వందల సంఖ్యలో భవనాలు పేకమేడల్లా కూలడంతో వేలాది మంది ఆ శిథిలాల కింద చిక్కుకున్నారు. రెండు దేశాల్లోనూ అక్కడి ప్రభుత్వాలు వివిధ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించాయి.
వెయ్యి దాటిన మృతుల సంఖ్య
మయన్మార్, థాయ్‌లాండ్(Thailand)లో భూకంప మృతుల సంఖ్య 1000 దాటిందని మిలిటరీ అధికారులు తెలిపారు. ఒక్క మయన్మార్‌లోనే కనీసం 1002 మంది మరణించినట్లు వెల్లడిచారు. మరో, 2370 మంది గాయపడినట్లు చెప్పారు. వరుస భూకంపాలతో అతాలకుతలమైన మయన్మార్‌లో మరోసారి ప్రకంపనలు సంభవించాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 4.2 తీవ్రతతో భూమి కంపించినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
ప్రపంచ దేశాల సాయం
ఇక ప్రకృతి విపత్తుతో కుదేలైన మయన్మార్, థాయ్‌లాండ్‌ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి. ‘ఆపరేషన్ బ్రహ్మ (Operation Bramha)’ కింద భారత్‌మయన్మార్‌కు 15 టన్నుల సహాయక సామగ్రి పంపింది. మరోవైపు అమెరికా, ఇండోనేషియా, చైనా కూడా అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించాయి. ప్రభావిత దేశాలకు సహాయక సామగ్రిని పంపుతున్నామని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో-గుటెరస్ తెలిపారు.






