చెర్రీ ఫ్యాన్స్ కు షాక్..‘గేమ్‌ ఛేంజర్‌’లో ఆ పాట తీసేశారు

తమిళ శంకర్‌ (Shankar) దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా తెరకెక్కిన సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ (జనవరి 10) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఎంతో ఆశగా ఈ సినిమాకు వెళ్లిన అభిమానులకు శంకర్ టీమ్ షాక్ ఇచ్చింది. ఈ సినిమాలో బాగా పాపులర్ అయిన ‘నానా హైరానా’ పాటను తొలగించింది. తమ ఫేవరెట్ సాంగ్ సినిమాలో లేకపోయేసరికి ప్రేక్షకులు నిరాశ చెందారు.

ఆ పాట లేదు 

అయితే దీనిపై ‘గేమ్ ఛేంజర్’ టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల నానా హైరానా పాటను సినిమా నుంచి తొలగించాల్సి వచ్చిందని తెలిపింది. జనవరి 14వ తేదీ నుంచి ఈ పాట అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఇక ‘నానా హైరానా’ పాట విడుదలైన కొంతసేపటిలోనే రూ.కోట్లలో వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ పాటను ప్రస్తుతం ప్రదర్శించలేకపోతున్నట్లు టీమ్‌ ప్రకటించడంతో సంగీత ప్రియులు నిరాశకు గురవుతున్నారు.

నానా హైరానా పాట తొలగించాం

‘‘అందరికీ ఇష్టమైన ‘నానా హైరానా’ పాట ఇన్‌ఫ్రారెడ్‌ ఇమేజ్‌ల ప్రాసెసింగ్‌లో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఈ కారణంగా ప్రస్తుతం దీన్ని ప్రదర్శించలేకపోతున్నాం. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తాం. జనవరి 14వ తేదీ నుంచి ఈ పాటను సినిమాలో జోడిస్తాం. దీనికోసం మా టీమ్‌ అంతా రాత్రి, పగలు కష్టపడి పనిచేస్తోంది’’ అని గేమ్ ఛేంజర్ సినిమా తెలిపింది. ఇవాళ విడుదలైన ఈ చిత్రంలో రామ్‌ చరణ్ యాక్షన్‌ హైలైట్‌గా నిలిచిందని అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *