తెలుగు సినీఇండస్ట్రీ(Telugu Cine Industry)లో కొంతకాలంగా ‘‘మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు(Mega Family Vs Allu)’’ అంటూ పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ సపోర్ట్(Mega Family Support To Allu Arjun)తోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. అయితే ప్రస్తుతం ఆ మూలాలను మరిచిపోయి, తనను ఎవరూ ఈ స్థాయికి తీసుకురాలేదని, తన నటనే తనను ఈ స్థాయిలో నిలబెట్టింది అనే విధంగా అల్లు అర్జున్ ప్రవర్తిస్తున్నారని ఇండస్ట్రీలో కొందరి సీనియర్ నటులు అభిప్రాయం. అయితే గతంలో చిరంజీవి(Megastar Chiranjeevi) తనకు దేవుడని, ఆయన వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని తెలిపాడు బన్నీ(Bunny). ఆ తర్వాత మెగా అభిమానులే తన ఫ్యాన్స్ అంటూ కూడా బన్నీ చెప్పుకొచ్చారు. అలాగే మెగా ఫ్యాన్స్(Mega Fans) కూడా స్టైలిష్ స్టార్‌ని ఓన్ చేసుకున్నారు. ఆయన ప్రతి సినిమాని హిట్ చేశారు.
ఆ కారణంతోనే బన్నీపై వ్యతిరేకత
అయితే ఈసారి ఏపీ(Andhra pradesh)లో జరిగిన అసెంబ్లీ ఎన్నిక(Assembly Elections)ల్లో అల్లు అర్జున్ తన మేనమామ పవన్ కళ్యాణ్(Pawan kalyan)కి సపోర్ట్ చేయకుండా, తన స్నేహితుడైన శిల్పా రవి(Shilpa Ravi) అందులోనూ ప్రతిపక్ష పార్టీ అయిన YCP సభ్యుడికి సపోర్ట్ చేయడంతో అసలైన రంగు బయటపడింది అని మెగా అభిమానులు కామెంట్లు వ్యక్తం చేశారు. ఇక దాంతో అప్పటినుంచి ‘మెగా వెర్సెస్ అల్లు’ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.
తప్పుని గుర్తిస్తే నీ దారి మార్చుకో: నాగబాబు
తాజాగా జనసేన నేత, కొనిదెల నాగబాబు(Konidela Nagababu, leader of Jana Sena) చేసిన ఓ ట్వీట్(Tweet) నెట్టింట ఆసక్తిని రేపుతోంది. ‘నువ్వు తప్పుడు దారిలో వెళ్తున్నావని నువ్వే గుర్తిస్తే వెంటనే నీ దారిని మార్చుకో. నువ్వు ఆలస్యం చేసే కొద్దీ, నువ్వు నిజంగా ఎక్కడి వాడివో అక్కడికి వెళ్లడం మరింత కష్టంగా మారుతుంది – స్వామి వివేకానంద’ అని పోస్ట్ చేశారు. ఆయన బన్నీని ఉద్దేశించే ఈ పోస్ట్ చేశారంటూ బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు. కాగా అల్లు అర్జున్ నటించిన “పుష్ప-2: ది రూల్(Pushpa-2: The Rule)” ఈనెల 5న విడుదల కానుంది.
"If you realize you have taken the wrong path, correct your course immediately. The longer you wait, the harder it becomes to return to where you truly belong".
– Swami Vivekananda.— Naga Babu Konidela (@NagaBabuOffl) December 1, 2024






