Thandel : రిలీజ్ కు ముందే సక్సెస్ మీట్ ప్లాన్.. ఏం కాన్ఫిడెన్స్ బాసూ?

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన లేటెస్ట్ సినిమా ‘తండేల్ (Thandel)’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది.

ఏం కాన్ఫిడెన్స్ బాసూ?

తండేల్ ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య (Naga Chaitanya) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సినిమా రిలీజ్ కు ముందే సక్సెస్ మీట్ ఎక్కడ నిర్వహించాలో ప్లాన్ చేసినట్టు తెలిపారు. శ్రీకాకుళంలో తండేల్ చిత్ర సక్సెస్ మీట్ (Thandel Success Meet) ను నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కామెంట్స్ చూస్తుంటే సినిమా హిట్ అవుతుందని చైతన్య చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. మరి ప్రేక్షకులు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.

చైతూ కెరీర్ లో బిగ్గెస్ బడ్జెట్ మూవీ

ఇక నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ సినిమాగా తండేల్ తెరకెక్కింది. సుమారు రూ. 75 కోట్లతో ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఈ బుకింగ్స్ చూస్తుంటే చైతన్య కెరీర్ లో భారీగా ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం తండేల్ తప్ప వేరే సినిమాలేం లేకపోవడం చైతన్యకు కలిసి వచ్చే అంశమే.

హ్యాట్రిక్ కొట్టేనా?

తండేల్ సినిమాతో సాయి పల్లవి, నాగ చైతన్య కాంబో రెండో సారి వెండితెరపై జత కడుతోంది. ఈ కాంబోలో వచ్చిన లవ్ స్టోరీ సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇక చందూ మొండేటి (Chandu Mondeti), నాగచైతన్య కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. ఇప్పటికే ఈ కాంబోలో వచ్చిన ప్రేమమ్, సవ్యసాచి సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇక తండేల్ తో ఈ కాంబో హ్యాట్రిక్ కొట్టేందుకు ప్రయత్నిస్తోంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *