Mana Enadu : టాలీవుడ్ నటుడు నాగచైతన్య (Naga Chaitanya) నటి శోభితా ధూళిపాళతో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. ఆగస్టులో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఇటీవలే పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. డిసెంబరు లేదా వచ్చే ఏడాది జనవరిలో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. అయితే శోభిత(Sobhita Dhulipala)తో పెళ్లి సందర్భంగా నాగ చైతన్య తన మాజీ భార్య సమంతతో ఉన్న చివరి జ్ఞాపకాలు కూడా చెరిపేశాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
సామ్ జ్ఞాపకాలు చెరిపేస్తున్న చై

2021లో సమంత(Samantha)తో విడిపోయిన నాగ చైతన్య ఆ తర్వాత శోభితతో ప్రేమలో పడ్డాడు. నాలుగేళ్ల తర్వాత ఈ జంట విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇక శోభిత తన లైఫ్ లోకి వచ్చే ముందు నాగ చైతన్య తన మాజీ భార్య సమంత జ్ఞాపకాలను పూర్తిగా చెరిపేస్తున్నాడు. ఇప్పటికే సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన ఫొటోలు(Samantha Naga Chaitanya Photo), పోస్టులన్నీ చై డిలీట్ చేసిన విషయం తెలిసిందే.. తాజాగా తన ఇన్‌స్ట్రాగ్రామ్ స్టోరీస్‌లలో ఉన్న సమంత ఫొటోలను కూడా తొలగించినట్లు సమాచారం.
ఆ చివరి ఫొటో ఇదే
సమంతతో కలిసి నాగ చైతన్య గతంలో ఓ కార్ రేసింగ్ (Car Racing)లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ‘బ్యాక్ త్రో …మిసెస్ అండ్ ది గర్ల్‌ఫ్రెండ్’ అంటూ ఒక ఫొటోను షేర్ చేశాడు. ఇప్పుడు చైతూ టైం లైన్‌లో ఆ ఫొటో కనిపించడం లేదు. సామ్ తో ఉన్న చివరి ఫొటోను కూడా తాజాగా చైతు తొలగించినట్లు తెలుస్తోంది. చైతూ డిలీట్ చేసిన సమంత ఫొటో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.






