‘తండేల్’కు తప్పని పైరసీ కష్టాలు.. ఆన్‌లైన్‌లో HD వెర్షన్

కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమైన అక్కినేని హీరో నాగచైతన్య (Naga Chaitanya) ఎట్టకేలకు తండేల్ చిత్రంతో ఓ హిట్ కొట్టాడు. థాంక్యూ, లాల్ సింగ్ చద్ధా, కస్టడీ చిత్రాల మిగిల్చిన పరాజయాల నుంచి డైరెక్టర్ చందూ మొండేటి తండేల్ సినిమాతో చైతూను గట్టెక్కించాడు. సాయి పల్లవి (Sai Pallavi) కథానాయికగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన విడుదలైంది. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.

తండేల్ కు పైరసీ బ్రేక్

పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్లతో దూసుకెళ్తున్న ఈ సినిమాకు పైరసీ (Thandel Piracy Movie) భూతం బ్రేక్ వేసింది. సినిమా రిలీజ్ అయి 24 గంటలు గడిచిందో లేదో .. అలా ఆన్ లైన్ లో ప్రత్యక్షమైంది. Movie Rulez, ఫిల్మి జిల్లా వంటి ప‌లు ఆన్‌లైన్ పైర‌సీ వెబ్‌సైట్‌ల‌లో ఈ సినిమా హెచ్‌డీ వెర్ష‌న్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇప్ప‌టికే పుష్ప 2, గేమ్ ఛేంజర్ సినిమాలను పైరసీ భూతం వెంటాడిన విషయం తెలిసిందే. తాజాగా తండేల్ చిత్రానికి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది.

తండేల్ కలెక్షన్లపై పైరసీ ప్రభావం

మొదటి రోజు బ్లాక్ బస్టర్ కలెక్షన్లు రాబట్టిన తండేల్ (Thandel Day 1 Collections) సినిమాపై ఇప్పుడు ఈ పైరసీ ప్రభావం చూపించేలా కనిపిస్తోంది. ఈ సినిమా లీక్ అవ్వ‌డంపై అక్కినేని ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దీనిపై చిత్ర బృందం స్పందిస్తూ ‘తండేల్ సినిమాను థియేట‌ర్లోనే చూడండి. పైర‌సీని ఎంక‌రేజ్ చేయ‌కండి’ అంటూ చెప్పుకొచ్చింది. వెంటనే పైరసీ వెబ్ సైట్లలో నుంచి ఆ చిత్రాన్ని తొలగించాలని డిమాండ్ చేసింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *