టాలీవుడ్ కపుల్ నాగ చైతన్య (Naga Chaitanya)- శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) ఇటీవలే వివాహ బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ జంట ఓ ఇంగ్లీష్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో తమ లవ్ స్టోరీ ఎలా మొదలైందో ఈ జంట చెప్పుకొచ్చింది. ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను వీరు వ్యక్తం చేశారు. మరి ఇందులో ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. మరి అవేంటో ఓసారి మనమూ చూద్దామా..?
అలా మొదలైంది
ఈ ఇంటర్వ్యూలో శోభిత తమ లవ్ జర్నీ (Chaitanya Sobhita Love Story) ఎలా మొదలైందో చెప్పుకొచ్చింది. ఓసారి సోషల్ మీడియాలో అభిమానులతో తాను చిట్ చాట్ చేస్తుంటే ఓ నెటిజన్.. ‘మీరెందుకు నాగచైతన్యను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో కావడం లేదు?’ అని అడిగారని చెప్పింది. ఆ ప్రశ్న అడగ్గానే తాను చైతూ ఇన్‌స్టా ప్రొఫైల్ ఓపెన్ చేశానని.. అయితే అతడు ఫాలో అవుతున్న 70 మందిలో తన ప్రొఫైల్ కూడా ఉండటం చూసి ఆశ్చర్యపోయానని తెలిపింది. ఆ తర్వాత చైతూను ఫాలో అవడం ప్రారంభించానని చెప్పిన శోభిత.. అక్కడి నుంచే తమ ప్రేమ ప్రయాణం ప్రారంభమైందని చెప్పుకొచ్చింది.
What could my mother be
to yours?
What kin is my father
to yours anyway?
And how did you and I meet ever?
But in love our hearts
are as red earth and pouring rain:
mingled beyond parting.–From Kurunthogai, translated by A K Ramanujan pic.twitter.com/5vIeZxWCm0
— Sobhita Dhulipala (@sobhitaD) August 10, 2024
చైతూ చాలా పాజిటివ్ పర్సన్
“చైతూతో పరిచయం అయ్యాక తన సింప్లిసిటీకి నేను ఫిదా అయ్యాను. తనకు నచ్చిన పనిని చైతూ చాలా శ్రద్ధగా చేస్తాడు. తన ఫేవరెట్ బైక్ క్లీనింగ్ కు దాదాపు రెండు గంటల సమయం కేటాయిస్తాడు. ఇక తనకు ఇష్టమైన వస్తువులను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు. నచ్చిన వారికోసం ఆయన ఏదైనా చేస్తాడు. లైఫ్ ను ఎలా ఎంజాయ్ చేయాలో చైతూకు బాగా తెలుసు. ఎన్ని సమస్యలు వచ్చినా.. ఎంత నిరాశ ఎదురైనా.. పాజిటివ్ గా ఉంటాడు.” అని శోభిత చెప్పుకొచ్చింది.
ఒంటరిగా తినడమూ ఓ కళ
ఇక సతీమణి శోభిత గురించి చైతన్య మాట్లాడుతూ.. “ఆమె తినేటప్పుడు చాలా ప్రశాంతంగా ఫుడ్ ను ఆస్వాదిస్తూ తినాలని అనుకుంటుంది. తినేటప్పుడు ఎవరైనా మాట్లాడిస్తే తనకు అస్సలు నచ్చదు. ఒంటరిగా భోజనం చేయడం కూడా ఓ కళ అంటూ చెబుతుంది.” అని చైతూ చెప్పాడు. ఇక శోభిత మాట్లాడుతూ ముంబయిలో ఉన్నప్పుడు అలా ఒంటరిగా తినడం అలవాటయిందని తెలిపింది. కానీ పెళ్లి తర్వాత కుటుంబం కలిసితో భోజనం చేయడం కొత్తగా ఉన్నా.. ఓ మంచి అనుభూతిని ఇస్తోందని చెప్పింది శోభిత.






