నాగచైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఇదే.!

నాగచైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ వచ్చేసింది. దూత్ వెబ్ సిరీస్ డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనున్నట్టు నేడు అధికారికంగా ప్రకటించారు.
Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య డిజిటల్ ప్లాట్ ఫాంలోకి అరంగ్రేటం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఓ వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు తెలిసనప్పటి నుంచి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తనతో ఇప్పటికే రెండు సినిమాలు తీసిన డైరెక్టర్ విక్రమ్ కె కుమార్, నాగ చైతన్య కాంబోలో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ ను చాలా కాలం క్రితమే ప్రకటించారు. కానీ అటు డైరెక్టర్ కు, ఇటు హీరోకు వేరే కమిట్ మెంట్లు ఉండడంతో ఈ ప్రాజెక్టు ఆలస్యం అవుతూ వచ్చింది. కానీ ఎట్టకేలకు ఈ వెబ్ సిరీస్ పూర్తి అయింది. దీనికి దూత అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు.
దూత్ వెబ్ సిరీస్ డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనున్నట్టు నేడు అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించి అమెజాన్ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేయగా ఇందులో నాగ చైతన్య వర్షంలో గొడుగు పట్టుకొని సస్పెన్స్ గా చూస్తున్నారు. దీంతో ఈ పోస్టర్ కూడా వైరల్ గా మారింది.
చైతు మొదటిసారి వెబ్ సిరీస్ లో నటించడంతో అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఈ సిరీస్ పై ఆసక్తి చూపిస్తున్నారు. త్వరలోనే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టి టీజర్, ట్రైలర్స్ విడుదల చేస్తారని సమాచారం. ఈ సిరీస్ లో ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయో తెలియాల్సి ఉంది. ఇక నాగచైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో సాయి పల్లవి జంటగా ఓ సినిమా చేస్తున్నారు.

Share post:

Popular