రజినీకాంత్ మూవీలో నాగార్జున కీలక పాత్ర? అక్కినేని హై వోల్టేజ్ డ్రామా!

సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలు చేస్తూ కుర్రాళ్లకు పోటీ ఇస్తూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. చివరిసారిగా జైలర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్నారు. ఇందులో సౌబిన్ షకీర్, ఉపేంద్ర రావు, శ్రుతి హాసన్, సత్యరాజ్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం ఆగస్టు 14, 2025న థియేటర్లలోకి రానుంది. దీనికి సంబంధించి చిత్రబృందం గతంలోనే అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరోవైపు త్వరలోనే 2023లో విడుదలైన జైలర్ చిత్రానికి సీక్వెల్ గా జైలర్ 2 సినిమా రాబోతోంది. చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. జైలర్ 2 మూవికి సంబంధించి రోజుకో న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అదెంటంటే.. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున కీలకపాత్రలో కనిపించనున్నారట. గతంలో ఈ చిత్రంలో ఎస్ జే సూర్య విలన్ పాత్రలో కనిపించగా ఇప్పుడు అతడి స్థానంలో నాగార్జున నటిస్తున్నారని వార్త వినిపిస్తుంది. అయితే ఈ వార్త ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *