ప్రస్తుతం అక్కినేని నాగార్జున హీరో పాత్రలకంటే గెస్ట్ రోల్స్ చేసేందుకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగా ఉన్నారు. రణ్‌బీర కపూర్ ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన నాగ్.. తాజాగా ధనుష్ హీరోగా నటిస్తున్న ‘కుబేర’ సినిమాలోనూ అతిథి పాత్రలోనే కనిపించనున్నాడు. ఇక రజనీకాంత్ ‘కూలీ’ సినిమాలో కూడా కింగ్ రోల్ మెయిన్ హీరో రేంజ్‌లో ఉండదని సినీవర్గాల్లో టాక్. ఇక మరో మూవీలో గెస్ట్ రోల్‌లో మెప్పించేందుకు నాగ్ రెడీ అవుతున్నారు.

మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో..
‘ఏజెంట్’ మూవీ భారీ డిజాస్టర్ తర్వాత అక్కినేని అఖిల్ (Akkineni Akhil) చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్(Lenin)’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరి(Murali Kishore Abburi) ఈ సినిమాకు దర్శకుడు. 30 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రం నిర్మాతలు నాగార్జున, నాగవంశీ(nagavamshi) ఈ మూవీని నవంబరులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్‌గా అఖిల్ పెళ్లి(Akhil Marriage) జరిగింది. కాబట్టి…షూటింగ్ అనుకున్న ప్రకారం కన్నా..కాస్త ఆలస్యంగానే మొదలు కావొచ్చు. ఇదే జరి గితే…‘లెనిన్’ మూవీ ఈ ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ మూవీలో అఖిల్‌కు జోడీగా శ్రీలీల కనిపించనుంది.

రాయలసీమ నేపథ్యంతో సాగే ఈ సినిమా
ఇక లెనిన్ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. రాయలసీమ నేపథ్యంతో సాగే ఈ సినిమాలో చాన్నాళ్ల క్రితం మా నాయన ఓ మాట చెప్పిండు అన్న డైలాగ్ ఉంది. అంటే కథ ప్రకారం ఈ సినిమాలో అఖిల్ పాత్రకు ఉండే ఫాదర్ రోల్ చాలా పవర్‌ఫుల్ అనుకోవచ్చు. ఈ పవర్‌ఫుల్ ఫాదర్ పాత్రలోనే నాగార్జున నటించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ‘మనం’ సినిమాలో నాగార్జున, నాగచైతన్య కలిసి యాక్ట్ చేశారు. ఇప్పుడు తన చిన్న కొడుకు అఖిల్ ‘లెనిన్’ సినిమాలో నాగార్జున భాగ మయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ప్రజెంట్ ధనుష్‌తో కలిసి నాగార్జున నటించిన ‘కుబేర’ సినిమా జూన్ 20న విడుదల కానుంది.






