సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)కు ఊరట లభించింది. ప్రతి ఆదివారం ఆయన పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలన్న నిబంధనను నాంపల్లి కోర్టు (Nampally Court) మినహాయించింది. బెయిల్ మంజూరు సమయంలో ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసులు ఎదుట హాజరు కావాలని గతంలో కోర్టు షరతు విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భద్రతా కారణాల దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని అల్లు అర్జున్ కోరడంతో కోర్టు ఆయనకు మినహాయింపు ఇచ్చింది. మరోవైపు ఆయన విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కూడా ఇచ్చింది.







