హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టైన విషయం తెలిసిందే. అనంతరం చిక్కడపల్లి ఠాణాకు తరలించి రెండుగంటల పాటు స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు బీపీ, షుగర్, కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. అన్ని పరీక్షల్లో ఆయనకు సాధారణ ఫలితాలు వచ్చాయి. ఈసీజీ పరీక్షలు కూడా నిర్వహించారు. అనంతరం పోలీసులు ఆయన్ను నాంపల్లి క్రిమినల్ కోర్టుకు తరలించారు.
నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్
నాంపల్లి కోర్టులో 9వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు అల్లు అర్జున్ ను పోలీసులు హాజరుపరిచారు. కోర్టు హాల్‌లో జనం ఎక్కువగా ఉండడంతో జడ్జి ఛాంబర్‌కు తరలించారు. అనంతరం నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు రిమాండు విధించింది. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో 14 రోజుల పాటు బన్నీకి రిమాండ్ విధించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బన్నీని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. జైలు వద్ద ఇప్పటికే భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు.
నాంపల్లి కోర్టుకు బన్నీ
మరోవైపు నాంపల్లి కోర్టుకు పుష్ప సినిమా నిర్మాతలు నవీన్, రవిశంకర్, నిర్మాతలు బన్నీ వాసు, నాగ వంశీ, ఎస్‌కేఎన్, పలువురు సినీ ప్రముఖులు, బన్నీ సన్నిహితులు, ఫ్యాన్స్ చేరుకున్నారు.






