
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై కాసేపట్లో నాంపల్లి కోర్టు (Nampally Court) తీర్పు వెల్లడించనుంది. ఇప్పటికే ఇరువైపుల వాదనలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో న్యాయస్థానం తీర్పును నేటి (శుక్రవారం)కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కాసేపట్లో దీనిపై నాంపల్లి కోర్టు తీర్పును వెలువరించనుంది.
అసలేం జరిగిందంటే..
‘పుష్ప-2 (Pushpa-2)’ బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన (Sandhya Theatre Stampede)లో అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నాంపల్లి కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయణ్ను జైలుకు తరలించారు. అయితే అదే రోజు హైకోర్టు (Telangana High Court) మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ మరుసటి రోజు ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు.
ఏం జరుగుతుందో
మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ ముగియడంతో ఆయన వర్చువల్‌గా విచారణకు హాజరయ్యారు. అదే రోజు అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇటీవల బన్నీ, అధికారుల తరఫు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది. ఈ క్రమంలో కాసేపట్లో తీర్పు వెల్లడించనుంది. అయితే కోర్టు తీర్పు నేపథ్యంలో అల్లు అర్జున్ కుటుంబం, అభిమానుల్లో ఆందోళన నెలకొంది.