నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా, బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అఖండ 2 తాండవం(Akhanda 2 Tandavam)’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2021లో విడుదలైన ‘అఖండ(Akhanda )’ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించడంతో, దీని సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమా విడుదల తేదీ వాయిదా(Release date postpone) అయినట్లు సినీవర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇందులో బాలయ్య మరోసారి పవర్‌ఫుల్ అఘోరా పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సీక్వెల్‌లో ఆధ్యాత్మికత, మాస్ యాక్షన్ మరింత ఎంటర్టైన్మెంట్ అందించనుంది.
షూటింగ్ షెడ్యూల్‌లో జాప్యంతోనే..
మొదట ఈ చిత్రం 2025 సెప్టెంబర్ 25న దసరా(Dussera) కానుకగా విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బాలయ్య పుట్టిన రోజు(Balakrishna Birthday) సందర్భంగా విడుదలైన టీజర్‌లో కూడా ఈ తేదీని నిర్ధారించారు. కానీ, షూటింగ్ షెడ్యూల్‌లో జాప్యం, గ్రాఫిక్స్ పనులు పూర్తికాకపోవడం, అలాగే అదే తేదీన పవన్ కళ్యాణ్ చిత్రం ‘OG’ విడుదల కావడంతో పోటీ తప్పదని భావించి, ‘అఖండ 2’ రిలీజ్‌ను డిసెంబర్ 18కి వాయిదా వేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు తెలిపాయి.
‘రాజాసాబ్’ వంటి చిత్రాలతో పోటీ ఉన్నప్పటికీ..
ఈ సినిమాలో సంయుక్త మీనన్(Samyukta Menon) హీరోయిన్‌గా, ఆది పినిశెట్టి(Aadi Pinisetty) విలన్‌గా నటిస్తున్నారు. జార్జియా, ప్రయాగ్‌రాజ్‌లలో షూటింగ్ జరిగింది, కానీ వర్షాల వల్ల కొన్ని షెడ్యూల్స్ రద్దయ్యాయి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల కానుంది. డిసెంబర్‌లోనూ ‘రాజా సాబ్’ వంటి చిత్రాలతో పోటీ ఉన్నప్పటికీ, మేకర్స్ ఈ తేదీని లాక్ చేసే అవకాశం ఉంది.






